BigTV English

Rice Cream For Face: మీ ఫేస్ ముద్ద మందారంలా మెరిసిపోవాలంటే.. రైస్ క్రీమ్‌తో ఇలా ట్రై చేయండి..

Rice Cream For Face: మీ ఫేస్ ముద్ద మందారంలా మెరిసిపోవాలంటే.. రైస్ క్రీమ్‌తో ఇలా ట్రై చేయండి..

Rice Cream For Face: ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది అనేక చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఫేస్ డల్‌గా కనిపించడం, ముఖంపై మచ్చలు, మొటిమలు రావడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. దీనికి అనేక కారణాలు కావచ్చు.. ఫేస్ కాంతివంతంగా అందంగా కనిపించాలంటే.. మీ డైట్ చాలా అవసరం.. మరీ ముఖ్యంగా ప్రతిరోజు పండ్లు, ఆరోగ్యకరమైన ఆహారం తినాల్సిందే.. దీంతో పాటు కంటి నిండ నిద్రకూడా చాలా అవసరం. వీటితో పాటు ప్రతిరోజు వ్యాయామం చేస్తే.. ముఖం మెరుస్తూ ముడతలు లేకుండా కనిపిస్తుంది. అయితే అందం కోసం చాలా మంది బయట మార్కెట్లో దొరికే పలు రకాల ఫేస్ క్రీములు, బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఫేసియల్స్ చేపిస్తుంటారు.


ఇవి టెంపరీగా పనిచేస్తాయి. పైగా వీటివల్ల చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంట్లోనే దొరికే  నాచురల్ పదార్ధాలతో ఫేస్ ప్యాక్‌లు ట్రై చేశారంటే.. మంచి ఫలితం ఉంటుంది. న్యూయర్, సంక్రాంతి సెలబ్రేషన్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈవెంట్లు, పూజలు ఉంటాయి కాబట్టి.. ఈ టైమ్‌లో మీరు మరింత అందగా కనిపించడానికి ఈ బెస్ట్ టిప్స్ పాటించండి. మీ అందం చూసి మీరే మురిసిపోతారు. ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రైస్, బాదంతో ఫేస్ క్రీమ్
ముందుగా మూడు టేబుల్ స్పూన్ బియ్యం, ఐదు బాదం పప్పులు తీసుకుని శుభ్రంగా వాష్ చేసి.. ఐదు, ఆరు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత బాదంపై తొక్కులు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీజార్ తీసుకుని అందులో నానబెట్టిన బియ్యం, బాదం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. దీన్ని చిన్న బౌల్‌లో తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, టీ స్పూన్ గ్లిజరిన్, రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలిపి బాగ్ మిక్స్ చేయండి.


ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి ఫ్రిజ్‌లో కొద్దిరోజులు నిల్వ చేసుకోవచ్చు. ఈ క్రీమ్‌ను ప్రతిరోజు రాత్రి ముఖం, మెడకు అప్లై చేసుకుని పడుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఫేస్‌పై మచ్చలు, ముడతలు, మొటిమలు తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది. చాలా అందంగా కనపించడంతో పాటు గ్లాసీ లుక్ మీ సొంతం అవుతుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఓసారి ఈ ఫేస్ క్రీమ్ ట్రై చేయండి.

Also Read:  కొత్త సంవత్సరానికి తీపి స్వాగతం.. ఈ వెరైటీస్​‌తో పార్టీ అద్దిరిపోద్ది!

శనగపిండి, పసుపుతో ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ శనగపిండి, టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ పెరుగు, టీ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ పచ్చి పాలు కలపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత సాధారణ నీటితో క్లీన్ చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మీ ముఖం మెరిసేలా చేస్తుంది. దీంతో పాటు ముఖంపై మచ్చలు, ముడతలు తొలగిపోవడంతో పాటు అవాంఛిత రోమాలు కూడా తొలగిస్తుంది. ఏదైనా ఫంక్షన్స్ వెళ్లే మందు ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×