Yashasvi Jaiswal: బోర్డర్ గోవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్ట్ ల సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆస్ట్రేలియా టూర్ లో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత ఆటగాడు కేఎల్ రాహుల్ అవుట్ విషయంలో థర్డ్ ఎంపైర్ ఇచ్చిన నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
Also Read: IND vs Aus 4th Test: బాక్సింగ్ టెస్టులో టీమిండియా ఘోర ఓటమి.. WTC ఆశలు లేనట్టే ?
మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో మంచి లెంత్ తో వచ్చిన బంతిని రాహుల్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. ఆ బంతి నేరుగా వెళ్లి కీపర్ అలెక్స్ కేరి చేతిలో పడింది. దీంతో అవుట్ కోసం అప్పిల్ చేశారు ఆసీస్ ఆటగాళ్లు. కానీ దానిని ఆన్ ఫీల్డ్ ఎంపైర్ నాట్ అవుట్ గా ప్రకటించడంతో వెంటనే రివ్యూ ను ఎంచుకున్నారు. అయితే బంతి బ్యాట్ ని తాకినప్పుడు శబ్దం వచ్చిందా..? లేక బ్యాట్ ప్యాడ్ ను తాకినప్పుడు శబ్దం వచ్చిందా..? అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది.
ఫ్రంట్ ఆన్ యాంగిల్ సరిగ్గా లేకపోవడంతో నిర్ణయం తీసుకోవడం కష్టమైంది. దీంతో ఆన్ ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయాన్ని రద్దు చేస్తూ థర్డ్ ఎంపైర్ రాహుల్ ని అవుట్ గా ప్రకటించారు. ఈ నిర్ణయం పై రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రిప్లై లో బంతి బ్యాట్ ని తాకినట్టు కనిపించినా.. అందుకు సరైన ఆధారాలు లేవు. అయితే ఈ టెస్ట్ లో భారత జట్టు గెలుపొందడంతో దీన్ని పెద్దగా పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు నాలుగో టెస్ట్ సందర్భంగా మరోసారి థర్డ్ ఎంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది. సాధారణ ప్రేక్షకులతో పాటు సునీల్ గవాస్కర్ లాంటి క్రికెట్ లెజెండ్ కూడా థర్డ్ ఎంపైర్ నిర్ణయం పై అసహనం వ్యక్తం చేశారు. మెల్ బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. 340 పరుగుల భారీ లక్ష్య చేదనలో బరిలోకి దిగిన భారత జట్టు విఫలమైంది. స్టార్ బ్యాటర్లు విఫలం అయినప్పటికీ.. మొదటినుండి నిలకడగా ఆడుతూ జట్టుకు అండగా నిలిచాడు యశస్వి జైస్వాల్.
ఆసీస్ కెప్టెన్ పాట్ కమీన్స్ వేసిన 70 ఓవర్ ఐదవ బంతి లెగ్ సైడ్ వైపుగా వేశాడు. ఆ బంతిని ఆడేందుకు జైష్వాల్ ప్రయత్నించాడు. కానీ అది మిస్ కావడంతో నేరుగా వికెట్ కీపర్ చేతిలో పడింది. ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేసినా.. ఆన్ ఫీల్డ్ ఎంపైర్ మాత్రం అవుట్ ఇవ్వలేదు. దీంతో వారు వెంటనే డిఆర్ఎస్ తీసుకున్నారు. రిప్లై లో బాల్ బ్యాటును తాకనట్లుగా కనిపించింది. పదేపదే పరిశీలించిన థర్డ్ ఎంపైర్ చివరకు అవుట్ గా ప్రకటించారు.
దీంతో జైస్వాల్ నిరాశగా వెనుదిరిగాడు. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. బంతి బ్యాట్ కి తగులుతున్నట్టుగా ఎలాంటి స్పైక్ కనిపించలేదు. కానీ బంతి దిశ మారుతూ ఉండడాన్ని గమనించిన థర్డ్ అంపైర్ జైస్వాల్ బ్యాట్ కి బంతి తగలడం వల్లే టర్న్ అయ్యిందని డిసైడ్ అయిపోయి అవుట్ గా ప్రకటించారు.
Also Read: Happy Retirement: ఇక మీ సేవలు చాలు.. అశ్విన్ లాగా రిటైర్మెంట్ ఇవ్వండి..!
అయితే సాంకేతికంగా బాల్ బ్యాటుకి తగిలినట్లు ఎలాంటి ఆధారం లేనప్పుడు. కేవలం విజువల్ ఎవిడెన్స్ ఆధారంగా అవుట్ గా ఎలా డిసైడ్ చేస్తారని ప్రశ్నించారు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. అయితే జైష్వాల్ ని అవుట్ గా ప్రకటించడం సరైన నిర్ణయం కాదని.. జట్టును డ్రా దిశగా తీసుకు వెళుతున్న అతడిని ఈ విధంగా అవుట్ గా ప్రకటించడంపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు భారత క్రికెట్ అభిమానులు.
Third Umpire giving the decision on Yashasvi Jaiswal. pic.twitter.com/HVYzaNkLlf
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 30, 2024