Rare Cat In Telangana Huzurnagar| తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఓ వింత జీవి కనిపించింది. ఇది చాలా అరుదైన పిల్లి జాతికి చెందిన జంతువుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇది చాలా సున్నితమైన జీవి అని పట్టుకోబోతే అది చనిపోయే ప్రమాదముందని ఫారెస్ట్ ఆఫీసర్స్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. హుజూర్‌నగర్ పట్టణం లో రెయిన్ బో కాలనీలో గురువారం తెల్లవారి జామున ఓ ఇంట్లో కుక్క గట్టిగా అరుస్తూ ఉండడంతో స్థానికులు, ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. ఆ కుక్కు ఇంటి పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మల వైపు చూస్తూ మొరుగుతూనే ఉంది. దీంతో నిద్ర లేచిన ఇంటి ఓనర్ షేక్ రఫీ ఏముందో నని కుతూహలంతో వెళ్లి చూశాడు. చెట్టు కొమ్మల చాటున నల్లపు రంగులో ఏదో పిల్లి లాంటిది పెద్ద జంతువు కనిపించింది. దాని ముఖం కూడా సరిగా కనిపించడం లేదు.
కుక్క అరుపులు విని పొరుగు ఇంటివారు, కాలనీ వాసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ముందు అందరూ ఇదేదో ప్రమాదకర అడవి జంతువు అని భావించి.. అందుకే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఆ తరువాత కాసేపటికి అక్కడికి చేరుకున్న ఫారస్ట్ సిబ్బంది.. దాన్ని అరుదైన పిల్లి జాతికి చెందిన కివేట్ (Civet) లేదా ఫోసా (Fossa) పిల్లి అని గుర్తించారు.
Also Read: పెళ్లైన రెండో రోజు వధువు ప్రసవం.. వరుడి షాకింగ్ నిర్ణయం..
కివేట్ పిల్లి చాలా సున్నితమైన జంతువు అని.. బహుళా భయంతో ఉదయం నుంచే చెట్టుపైనే ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కివేట్ పిల్లి సాధారణంగా రాత్రి వేళ మాత్రమే సంచరిస్తుందని తెలిపారు. ఈ పిల్లిని పట్టుకోబోతే దాని హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకొని ఆ జంతువు చనిపోయే ప్రమాదముందని వెల్లడించారు. ఈ పిల్లి వల్ల మనుషులకు ఎటువంటి ప్రమాదం లేదని కూడా అభయమిచ్చారు. ఆ తరువాత అటవీ సిబ్బంది జాగ్రత్తగా ఆ అరుదైన పిల్లిని బంధించి అక్కడి నుంచి తీసుకెళ్లారు.
ఇలాంటి ఘటనే నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి కొండ ప్రాంతంలో ఒక అరుదైన పిల్లి జాతి జంతువు కనిపించింది. ఈ పిల్లి తాడేపల్లి కొండ నుండి దిగి.. ముగ్గురోడ్డులోని లాజర్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించింది. ఈ పిల్లిని చూసిన స్థానికులు మొదట భయపడ్డారు. స్థానికులు గుమిగూడడంతో, ఆ జంతువు ఇంట్లోకి వెళ్లి వస్తువుల మధ్య దాక్కుంది.
స్థానికులు కష్టపడి ఆ పిల్లిని పట్టుకున్నారు. తర్వాత అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులు ఇది చాలా అరుదైన జంతువు అని గుర్తించారు. ఇది ఆఫ్రికా అడవుల్లో సంచరించే కివేట్ జాతికి చెందిన పిల్లిగా నిర్ధారించారు. తాడేపల్లిలో పిల్లిని స్వాధీనం చేసుకున్న అధికారులు దాన్ని ఆసుపత్రికి తరలించారు. పిల్లికి వైద్య పరీక్షలు చేసిన తర్వాత.. దాన్ని అడవిలోకి వదిలేసేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
కివేట్ పిల్లిలో కూడా పామ్ కివేట్ పిల్లి వేరు అది పామ్ లుకీ పండ్లు తిని వాటిని పూర్తిగా అరగించకుండా మల రూపంలో విసర్జిస్తుంది. ఆ పామ్ లుకీ పండ్లు పిల్లి కడుపులోని జీర్ణ ద్రవాలతో మిళితం కావడంతో వాటితో చాలా దేశాల్లో కాఫీ చేసుకొని తాగుతారు. ఈ కాఫీ ధర చాలా ఎక్కువ సుమ. అందుకే పిల్లి మలంలో విసర్జించే ఆ పామ్ లుకీ కాఫీ గింజలు భలే డిమాండ్ ఈ కారణంగా కొన్ని దేశాల్లో ఈ కివేట్ పిల్లులను ఈ పామ్ లుకీ గింజల కోసం బంధించి పెంచుతారు. వాటికి ఇతర ఆహారం పెట్టకుండా పోషిస్తున్నారు. అయితే ఇలా చేయడం జంతువులపై కృూరత్వం లాంటిదేననే విమర్శలు కూడా ఉన్నాయి.