Rose Water For Face: రోజ్ వాటర్ చర్మ సౌందర్యానికి చాలా మేలు చేస్తుంది. రోజ్ వాటర్ వాడటం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. రోజ్ వాటర్‌లో సహజ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.
రోజ్ వాటర్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలోనూ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, ఇది మచ్చలను తొలగించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మరి చర్మంపై రోజ్ వాటర్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎలా వాడితే చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోజ్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు:
1. ముఖం యొక్క రంగు:
ముఖం యొక్క రంగును పెంచడంలో రోజ్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్‌లో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు ముఖం లోపలి నుండి కాంతిని పెంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా చర్మాన్ని తెల్లగా చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ముఖం యొక్క రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే తరచుగా ముఖానికి రోజ్ వాటర్ వాడటం వల్ల మీ ముఖం యొక్క రంగు మెరుగుపడుతుంది. ముఖం మీద నల్లటి మచ్చలు, ఎర్రటి మచ్చలు ఉన్నా కూడా తొలగిపోతాయి.
2. మొటిమలు తొలగించడం:
రోజ్ వాటర్ వాడటం వల్ల మొటిమలు చాలా వరకు తగ్గుతాయి. రోజ్ వాటర్‌లో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల ఇవి ముఖంపై మొటిమలను నయం చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, వాటి వల్ల కలిగే నల్ల మచ్చలను తొలగించడంలో కూడా సహాయపడతాయి. మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు తరచుగా రోజ్ వాటర్ వాడటం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
3. మృత కణాల తొలగింపు:
రోజ్ వాటర్ మృత కణాలను తొలగించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా
రోజ్ వాటర్ అద్భుతమైన స్కిన్ టోనర్‌గా కూడా పనిచేస్తుంది. మీరు దీంతో టోనర్ తయారు చేసి తరచుగా ఉపయోగించవచ్చు. మొదట ఇది చర్మాన్ని శుభ్ర పరుస్తుంది. రెండవది చర్మాన్ని తేమగా చేస్తుంది. మూడవది చర్మాన్ని టోన్ చేస్తుంది, ముడతల నుండి కాపాడుతుంది.
4. చర్మంపై చికాకు:
చర్మపు చికాకు నుండి ఉపశమనం పొందడంలో రోజ్ వాటర్ ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజ్ వాటర్ చర్మాన్ని లోతుల నుండి చల్ల బరుస్తుంది కాబట్టి, దీనిని వాడటం వల్ల డ్రై స్కిన్ వల్ల వచ్చే చికాకు నుండి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా ఇది చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేయడంలో కూడా సహాయపడుతుంది.
Also Read: ఆముదంలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జన్మలో బట్ట తల రాదు
రోజ్ వాటర్ లో విటమిన్ ఇ క్యాప్సూల్ కలిపి రాత్రిపూట మీ ముఖానికి మసాజ్ చేస్తే ఉదయం మీ చర్మం ఎలా మెరుస్తుందో చూడండి. ఇలా చేయడం వల్ల మీ చర్మానికి లోతైన తేమ అందుతుంది. అలాగే ఇది చర్మం పై ఉండే మచ్చలను కూడా తొలగిస్తుంది. చర్మం యొక్క రంగును మెరుగుపరుస్తుంది.