Pakistan Housemaid Murder | పేదరికం కారణంగా చిన్నతనంలోనే ఓ ఇంట్లో పనిమనిషిగా కుదరింది ఓ బాలిక. ఆమె ఎంత పనిచేసినా.. ఇంటి ఓనర్లు ఆ బాలిక పట్ల కృూరంగా ఉండేవారు. తన తల్లిదండ్రులకు తమ్ముళ్లకు, చెల్లెళ్లకు పోషించడానికి ఆ చిన్నారి ఎన్నికష్టాలైనా సహించింది. ఈ క్రమంలో ఆ ఇంటి ఓనర్లు ఆ బాలికను చిన్న కారణంగానే విపరీతంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలై ఆ పాప చనిపోయింది. ఈ ఘటన భారత్ పొరుగు దేశం పాకిస్తాన్ లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం రావల్పిండి నగరంలో నివసించే రాషిద్ షఫీక్, అతన భార్య సన తమ ఇంట్లో పనిచేసేందుకు 13 ఏళ్ల బాలిక ఇఖ్రాను రెండేళ్ల క్రితం నియమించుకున్నారు. పేదరికం కారణంగా ఇఖ్రా తల్లిదండ్రలు దీనమైన స్థితిలో ఉన్నారు. వారికి మొత్తం 8 మంది సంతానం. కుటుంబ భారం మోయలేక ఇఖ్రా తండ్రి సనా ఉల్లా.. తన ముగ్గురు పిల్లలకు ఇంటి పనులు, లేబర్ పనులు చేయడనాకి పంపుతున్నాడు. తండ్రి అప్పులు బాధలు చూడలేకే ఇఖ్రా 8 ఏళ్ల వయసు నుంచే పలువురి వద్ద ఇంటి పని చేసేది. ప్రస్తు
ఈ క్రమంలో రావల్పిండిలో రాషిద్ షఫీక్ ఇంట్లో పనికి కుదిరిన ఇఖ్రాకు దాదాపు రూ.2,500 నెల జీతం అందేది. అయితే అనుకోకుండా కొన్ని రోజుల క్రితం ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ఇఖ్రా సీరియస్ గా ఉన్నట్లు సనా ఉల్లాకు పోలీసులు తెలిపారు. ఇది తెలిసి సనా ఉల్లా పరుగు పరుగున అక్కడికి వెళ్లాడు. అక్కడ ఇజ్రా పరిస్థితి చూస్తే.. ఆమె శరీరం నిండా గాయాలు.. తలకు బలంగా గాయాలయ్యాయని.. కాళ్లు, చేతులు విరిగిపోయినట్లు ఫ్రాక్చర్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఆ నొప్పులు భరించలేక చికిత్స మధ్యలోనే ఇఖ్రా చనిపోయింది.
Also Read: కాశ్మీర్ అంశంపై మరోసారి పాకిస్తాన్ లొల్లి.. భారతభూభాగంలో ప్రజాభిప్రాయ సేకరణకు డిమాండ్
అది చూసి ఇఖ్రా తండ్రి సనాఉల్లా గుండెలు బాదుకున్నాడు. తన పేదరికమే తన కూతురు ప్రాణాలు తీసుకుందని ఏడ్చాడు. కానీ తన బిడ్డను అంత కృూరంగా కొట్టిన ఇంటి యజమానులను వదిలి పెట్టకూడదని వారిని శిక్షించాలని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు విచారణ ప్రారంభించగా.. ఇఖ్రా పనిచేసే ఇంటి యజమానులు రాషిద్ షఫీక్, అతని భార్య వారింట్లో ఖురాన్ బోధించే ఒక టీచర్ పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా.. ముగ్గురు పరారయ్యారు. కానీ వారిని పోలీసులు గాలించి పట్టుకున్నారు.
అయితే ముందుగా రాషిద్ షఫీక్ భార్య సనా మాట్లాడుతూ.. ఇఖ్రా తన ఇంట్లో దొంగతనాలు చేసేదని.. అందుకే శిక్షించేందుకు కొట్టాల్సి వచ్చేదని చెప్పింది. కానీ వారి పిల్లలకు ఖురాన్ బోధించే టీచర్ మాత్రం పోలీసుల ముందు నిజం చెప్పేశాడు. ఇఖ్రాను ఆ ఇంట్లో చాలా హింసించేవారని.. కేవలం యజమానులకు చెప్పకుండా ఇంట్లో ఉన్న చాక్లెట్లు తినేసిందని కారణంగా రాషిద్ షఫీక్ భార్య విపరీతంగా కొట్టిందని.. కర్రలతో కాళ్లు, చేతులు, తలపై గట్టిగా బాదిందని చెప్పాడు. ఇఖ్రా స్పృహ తప్పి పడిపోవడంతో ఒక గదిలో పడేసి తనను పిలిచి చలనం లేకుండా పడి ఉన్న ఇఖ్రాను ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారని తెలిపాడు.
అలా తాను కేవలం ఇఖ్రాను ఆస్పత్రి వరకు చేర్చానని ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని చెప్పాడు. పాకిస్తాన్ పోలీసులు బాలకార్మికులు నిషేధ చట్టం ప్రకారం ఒక కేసు, మరొకటి హత్య కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.