Rose Water For Hair: రోజ్ వాటర్‌ను చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తుంటారు. ముఖం కాంతివంతగా మార్చడంలో రోజ్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే జుట్టు పెరుగుదలకు కూడా రోజ్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. రోజ్ వాటర్ జుట్టుకు పోషణనిస్తుంది. అంతే కాకుండా జుట్టు తేమను కాపాడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు కోసం రోజ్ వాటర్ ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోజ్ వాటర్ గులాబీ పువ్వుల నుండి తయారయ్యే సహజ పదార్ధం. ఇది చర్మ సంరక్షణకే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది.రోజ్ వాటర్‌లో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది జుట్టును బలంగా, మూలాల నుండి మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
అందుకే జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా ఉండటానికి రోజ్ వాటర్ ఉపయోగించాలి. రోజ్ వాటర్ తో హెయిర్ మాస్కులను తయారు చేసి వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
1. రోజ్ వాటర్ , తేనె ప్యాక్:
తేనె జుట్టుకు బాగా పోషణనిస్తుంది. అంతే కాకుండా రోజ్ వాటర్ జుట్టును మృదువుగా చేస్తుంది. తగిన మోతాదులో తేనె తీసుకుని అందులో రోజ్ వాటర్‌లో మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ సిద్ధం చేసుకోండి. దీన్ని జుట్టు , తలకు పట్టించి 20-30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది .
2. రోజ్ వాటర్ , కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె జుట్టుకు అద్భుతమైన మాయిశ్చరైజర్. రోజ్ వాటర్‌తో కలిపి వాడటం వల్ల ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. కాస్త కొబ్బరి నూనె తీసుకుని అందులో కొంత రోజ్ వాటర్ కలిపి జుట్టుకు మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత జుట్టును వాస్ చేయండి. ఇలా తరుచుగా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
3. రోజ్ వాటర్, అలోవెరా ప్యాక్:
కలబంద జుట్టు చికాకును తగ్గిస్తుంది. అంతే కాకుండా రోజ్ వాటర్ జుట్టుకు తేమను అందిస్తుంది. వీటితో తయారు చేసిన మిశ్రమాన్ని తలకు పట్టించి 20-30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత వాష్ చేయండి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
4. రోజ్ వాటర్ , ఉసిరి పొడి:
ఉసిరికాయ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఉసిరి కాయ పొడిలో రోజ్ వాటర్‌తో కలిపి మిక్స్ చేయండి. దీనినితలకు పట్టించి 20-30 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా ఉంటుంది.
5. రోజ్ వాటర్‌తో మసాజ్ చేయండి:
నేరుగా రోజ్ వాటర్‌తో స్కాల్ప్‌ను సున్నితంగా మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టు మూలాలకు మరింత పోషణను అందిస్తుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. ఇది శిరోజాలను కూడా శుభ్రపరుస్తుంది.
Also Read: ఈ టిప్స్ పాటిస్తే.. జన్మలో జుట్టు రాలదు
రోజ్ వాటర్‌తో హెయిర్ వాష్:
జుట్టును షాంపూతో వాష్ చేసిన తర్వాత చివరగా రోజ్ వాటర్‌తో జుట్టును కడగాలి. ఇది జుట్టు మూలాలను ఉపశమనం చేస్తుంది. అంతే కాకుండా చుండ్రును కూడా తగ్గిస్తుంది. జుట్టును మృదువుగా కూడా చేస్తుంది.