Virat Kohli: ఆస్ట్రేలియాలోని మేల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ ప్రారంభమైనప్పటి నుంచి భారత ఆటగాడు విరాట్ కోహ్లీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తొలిరోజు ఆట సందర్భంగా ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కాన్ స్టాస్ – విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వాగ్వాదం పెద్ద వివాదానికి దారితీసింది. ఓవర్ మధ్య విరామంలో పిచ్ పై వెళుతున్న కోహ్లీ ఆస్ట్రేలియా యంగ్ ప్లేయర్ కాన్ స్టాస్ ని ఢీకొనడం ఈ వివాదానికి కారణమైంది.
Also Read: Virat Kohli: బాక్సింగ్ టెస్టులో కలకలం..విరాట్ వైపు దూసుకొచ్చిన ప్రేక్షకుడు..!
అయితే కోహ్లీ ఉద్దేశపూర్వకంగానే అతడిని ఢీ కొట్టినట్లు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక కోహ్లీ యాంటీ ఫ్యాన్స్ “చోక్లి” అనే పదాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. పలువురు మాజీ ప్లేయర్స్ కూడా విరాట్ కోహ్లీ తీరును తప్పుబట్టారు. మొదటిరోజు మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20% జరిమానాగా విధించింది ఐసీసీ. అంతేకాదు అతడి ఖాతాలో ఓ డీ మెరిట్ పాయింట్ ని కూడా జోడించింది.
కానీ ఆస్ట్రేలియా బ్యాటర్ సామ్ కాన్ స్టాన్ మాత్రం ఈ ఘటన అనుకోకుండా జరిగిందని చెప్పుకొచ్చాడు. విరాట్ వస్తున్నట్లు గమనించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని. కోహ్లీ నా ఫేవరెట్ ప్లేయర్ అని చెప్పుకొచ్చాడు. తాను దీనిని పెద్ద సమస్యగా భావించడం లేదని.. క్రికెట్ లో ఇదంతా సర్వ సాధారణమేనని అతడు స్పష్టం చేశాడు. కానీ ఆస్ట్రేలియా మీడియా మాత్రం కోహ్లీపై తీవ్ర అక్కసు వెళ్ళగక్కుతోంది. “క్లౌన్” జోకర్ అనే పదంతో తీవ్రమైన విమర్శలు చేసింది.
అయితే ఆస్ట్రేలియా మీడియా చేస్తున్న ఈ వ్యాఖ్యలపై తాజాగా బీసీసీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందిస్తూ.. ” క్రికెట్ మైదానంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం సాధారణమని.. వాటిని అంగీకరించి ముందుకు సాగాలి” అని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై భారత మాజీ క్రికెటర్ రవి శాస్త్రి కాస్త ఘాటుగా స్పందించారు.” సొంత గడ్డపై ఆస్ట్రేలియా ఇలానే స్పందిస్తుందని తెలుసు. ఈ సమయంలో మన ఆటగాళ్లకు మన దేశ మద్దతు కూడా ఉండాలని కోరుకుంటున్న.
ఆస్ట్రేలియా మీడియా ఇలా హెడ్లైన్లు పెట్టడంలో నాకేం ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే మేల్ బోర్న్ లో ఆస్ట్రేలియా గత 13 ఏళ్లుగా మ్యాచ్ గెలవలేదు. 2011లో చివరిసారిగా ఓటేస్తే మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం వచ్చింది. అందువల్ల వారు ఇలాంటి ప్రయోగాలు చేస్తారు. కోహ్లీ – కాన్ స్టాస్ మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆస్ట్రేలియా మీడియా ప్రయత్నించింది ” అని రవి శాస్త్రి పేర్కొన్నారు.
Also Read: Mohammed Siraj: సిరాజ్ ఉండి దండగే.. 23 ఓవర్లు.. ఒక్క వికెట్ తీయలేదు ?
అయితే ఇలాంటి సంఘటనలు క్రికెట్ కి కొత్త కోణాలు తీసుకువస్తాయని.. కానీ ఆటగాళ్లపై సమన్యాయం ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆస్ట్రేలియా మీడియా చేసిన వ్యాఖ్యలపై భారత క్రీడాభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.