Amitabh Bachchan: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ గురించే టాపిక్ నడుస్తోంది. ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్స్ దగ్గర మొదలయిన సమస్య.. ఇక్కడవరకు తీసుకొచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక నిందితుడిగా పోలీసులు, కోర్టులు చుట్టూ తిరుగుతున్నాడు. అయినా కూడా ఫ్యాన్స్ మాత్రం ఇంకా తనను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సమయంలో సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన గురించి ఇంటర్నేషనల్ మీడియా సైతం మాట్లాడుకుంటోంది. కానీ ఇదంతా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు తెలియదనుకుంటా. అందుకే తను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 16’లో అల్లు అర్జున్ గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు.
అల్లు అర్జున్ ఫ్యాన్
బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఇప్పటికీ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 15 సీజన్స్ పూర్తిచేసుకొని 16వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. తాజాగా కోలకత్తా నుండి హౌస్‌వైఫ్ అయిన రజినీ బర్నివాల్.. ఈ షోకు కంటెస్టెంట్‌గా వచ్చారు. వచ్చిన వెంటనే తనకు తెలుగులో అల్లు అర్జున్ అంటే ఇష్టమని, హిందీలో అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టమని చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఇప్పటికిప్పుడు తనకు ఫ్యాన్ అని చెప్తే ఏమీ ఉపయోగం ఉండదని అమితాబ్ ఆటపట్టించారు. అల్లు అర్జున్ గురించి ఆయన కూడా గొప్పగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇదంతా విన్న తర్వాత అసలు టాలీవుడ్‌లో ఏం జరుగుతుందో అమితాబ్‌కు ఐడియా లేదనుకుంటా అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.
Also Read: సల్మాన్ ఖాన్‌ను ప్రేమించాను, నాకోసమే ఆ సినిమా తీశాడు.. సీనియర్ హీరోయిన్ స్టేట్‌మెంట్
తనతో పోల్చకండి
‘‘అల్లు అర్జున్‌కు అద్భుతమైన టాలెంట్ ఉంది. ఆయనకు అంతటా వస్తున్న పాపులారిటీకి ఆయన నిజమైన అర్హులు. నేను కూడా ఆయనకు పెద్ద ఫ్యాన్‌ను. ఇటీవల ఆయన నటించిన పుష్ప 2 (Pushpa 2) సినిమా విడుదలయ్యింది. మీరు ఇంకా ఆ సినిమా చూడకపోయింటే కచ్చితంగా చూడండి. కానీ నన్ను మాత్రం ఆయనతో పోల్చకండి’’ అంటూ సమాధానమిచ్చారు అమితాబ్ బచ్చన్. అల్లు అర్జున్ కూడా పలుమార్లు అమితాబ్ బచ్చన్‌పై తనకు ఉన్న ఇష్టాన్ని బయటపెట్టాడు. చాలామంది తెలుగు హీరోలు బాలీవుడ్‌లో తమకు నచ్చే హీరో ఎవరు అంటే అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) పేరే చెప్తారు. అలాగే అల్లు అర్జున్ కూడా ఒక సందర్భంలో చెప్పాడు.
ఆయనంటే ఇష్టం
‘పుష్ప 2’ ప్రమోషన్స్ సమయంలో ముంబాయ్ వెళ్లినప్పుడు ఏ బాలీవుడ్ యాక్టర్ తనను బాగా ఇన్‌స్పైర్ చేశారు అనే ప్రశ్న ఎదురయ్యింది. దానికి సమాధానంగా అమితాబ్ బచ్చన్ పేరు చెప్పాడు అల్లు అర్జున్. ‘‘అమితాబ్ గారు నన్ను చాలా ఇన్‌స్పైర్ చేశారు. మేము ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము కాబట్టి ఆయనంటే మాకు చాలా ఇష్టం. మేము పెరుగుతున్న సమయంలో ఆయన ప్రభావం మాపై చాలా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నేను అమితాబ్‌కు అతిపెద్ద ఫ్యాన్’’ అని చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ (Allu Arjun) చెప్పిన ఈ మాటలు అమితాబ్ వరకు వెళ్లాయి. దీంతో వెంటనే బన్నీకి థాంక్యూ చెప్పారు బిగ్ బి. అలా ఒకరిపై మరొకరి అభిమానాన్ని పలుమార్లు బయటపెట్టారు.