Rosewater Toner: చర్మ సంరక్షణకు రోజ్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ప్రత్యేకంగా సహజ గులాబీల నుండి తయారు చేయబడుతుంది. దీనిలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించబడవు.
రోజ్ వాటర్ ఒక సహజ టోనర్. ఇది అన్ని చర్మ రకాలకు మేలు చేస్తుంది . మార్కెట్లో లభించే రసాయనాలతో తయారు చేసిన టోనర్లకు బదులుగా ఇంట్లో తయారుచేసిన స్వచ్ఛమైన రోజ్ వాటర్‌ను ఉపయోగించడం ద్వారా, మీ చర్మం చాలా కాలం పాటు ఆరోగ్యంగా , మెరుస్తూ ఉంటుంది. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. మరి చర్మ సౌందర్యానికి రోజ్ వాటర్ వల్ల ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. చర్మానికి సహజ తేమ:
రోజ్ వాటర్‌ని క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మాన్ని హైడ్రేట్ గా మార్చుకోవచ్చు. అంతే కాకుండా రోజ్ వాటర్ చర్మాన్ని మృదువుగా, తాజాగా ఉంచుతుంది . రోజ్ వాటర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది చర్మం యొక్క తేమను కాపాడుతుంది. అంతే కాకుండా పొడి చర్మ సమస్యను తొలగిస్తుంది.
2. చర్మాన్ని శుభ్రపరుస్తుంది:
ఈ రోజ్ వాటర్ ముఖంపై మురికి, ధూళిని సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. దీన్ని కాస్త కాటన్ పై వేసి.. తర్వాత ముఖం మీద అప్లై చేయడం వల్ల చర్మంలోని అదనపు నూనె , మురికి తొలగిపోయి.. చర్మం శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
3. సహజ టోనర్:
రోజ్ వాటర్ ను స్కిన్ టోనర్ గా కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మ రంధ్రాలను బిగించి, చర్మాన్ని యవ్వనంగా, తాజాగా కనిపించేలా చేస్తుంది. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారు రోజ్ వాటర్ తరచుగా వాడటం వల్ల సమస్య తొలగిపోతుంది. అంతే కాకుండా ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
4. వడదెబ్బ నుండి ఉపశమనం:
వేసవిలో, తీవ్రమైన ఎండ కారణంగా చర్మం రంగు మారుతుంది. ఇలాంటి సమయంలో ముఖం, చేతులపై రోజ్ వాటర్ స్ప్రే చేయడం వల్ల వడదెబ్బ నుండి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని చల్లబరుస్తుంది.
5. మేకప్ సెట్ చేయడానికి:
మీ మేకప్ ఎక్కువసేపు ఉండేలా రోజ్ వాటర్ సహజ సెట్టింగ్ స్ప్రేలా పనిచేస్తుంది. మేకప్ తర్వాత కొద్దిగా రోజ్ వాటర్ ముఖంపై చల్లుకోవడం వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది. అంతే కాకుండా మేకప్ ఎక్కువసేపు ఉంటుంది.
జుట్టుకు మేలు:
1. రోజ్ వాటర్ పొడి జుట్టును మృదువుగా చేస్తుంది. రోజ్ వాటర్ లో కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెతో కలిపి జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టులోని తేమ చెక్కు చెదరకుండా ఉండి, మరింత మృదువుగా మారుతుంది. అంతే కాకుండా జట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
2. రోజ్ వాటర్ ని షాంపూతో కలిపి తలకు అప్లై చేయడం వల్ల తల చర్మం బాగా శుభ్రపడి చుండ్రు సమస్య తగ్గుతుంది.
3.షాంపూ చేసిన తర్వాత మీ జుట్టును రోజ్ వాటర్ తో శుభ్రం చేయడం వల్ల మీ జుట్టుకు సహజమైన మెరుపు వస్తుంది . అంతే కాకుండా ఇది మీ జుట్టును సిల్కీగా మారుస్తుంది.
Also Read: బార్లీ వాటర్ తాగితే.. శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే !
ఇలా కూడా వాడొచ్చు:
రోజ్ వాటర్ స్ప్రే చేయడం వల్ల ముఖం తాజాగా ఉంటుంది .
కంటి ప్యాక్ గా: చల్లని రోజ్ వాటర్ లో దూదిని ముంచి కళ్ళపై ఉంచండి. ఇది కంటి అలసటను తగ్గిస్తుంది.
ఫేస్ ప్యాక్‌లో కలపడం: రోజ్ వాటర్‌ను శనగపిండి, ముల్తానీ మిట్టి లేదా కలబంద జెల్‌తో కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. ఇది చర్మం మెరిసేలా చేయండి.