Safflower Oil: జుట్టు సంబంధిత సమస్యలతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు బయట మార్కెట్‌లో దొరికే ఆయిల్స్ వాడుతుంటారు. ఇలాంటి ఆయిల్స్ కొన్ని సార్లు జుట్టును డ్యామేజ్ చేస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలడానికి కారణం అవుతాయి. ఇలాంటి సమయంలోనే కుసుమ పూనె వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కుసుమ నూనె తలకు చాలా మంచిదని చెబుతారు. అంతే కాకుండా ఇందులోని విటమిన్లు స్కాల్ఫ్‌ను హైడ్రేట్ గా ఉంచుతాయి. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కుసుమ నూనెను జుట్టుకు ఎలా వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్కాల్ప్ స్క్రబ్ :
చల్లని వాతావరణంలో, చర్మంపై మృతకణాలు పేరుకుపోతాయి. దీని కారణంగా మీ చర్మం పొడిగా మారుతుంది. ఇటువంటి పరిస్థితిలో మీరు డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి సున్నితమైన ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌ను తయారు చేసి ఉపయోగించాలి. దీని కోసం, 2 టేబుల్ స్పూన్ల కుసుమ నూనెను 1 టేబుల్ స్పూన్ చక్కెరతో కలపండి. ఇప్పుడు మీ స్కాల్ప్‌ను కొద్దిగా తేమగా చేసి, ఆపై దానిని తలకు అప్లై చేయండి. ఇప్పుడు మసాజ్ చేయండి. తర్వాత నీళ్లతో తలని శుభ్రం చేసి షాంపూతో కడగాలి.
కుసుమ నూనె స్పే చేయండి:
చలికాలంలో మీ జుట్టు , స్కాల్ప్ సమస్యలను ఎదుర్కుంటున్నట్లయితే కుసుమ నూనె నుండి కూడా స్ప్రే తయారు చేయవచ్చు. ఇది మీ స్కాల్ప్‌ను హైడ్రేట్ చేయడమే కాకుండా స్టికీగా మారకుండా కాపాడుతుంది. అందుకే చలికాలంలో ఈ స్ప్రేని ఉపయోగించడం మంచిది. దీన్నితయారు చేయడానికి, స్ప్రే బాటిల్‌లో 2 భాగాలు నీరు, 1 భాగం కుసుమ నూనె కలపండి. దీన్ని బాగా షేక్ చేసి మీ తలపై స్ప్రే చేయండి .