Sankranthiki Vasthunam Collections : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగా సైతం రికార్డులు కొల్లగొడుతున్న ఈ సినిమా 12 రోజుల కలెక్షన్స్ ను చిత్ర బృందం వెల్లడించింది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా వసూళ్లను చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటివరకు రూ. 260 కోట్లు వసూలు చేసినట్టు తెలిపింది. త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఉందని సైతం తెలిపింది.
ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి వరుస రికార్డులను కొల్లగొడుతుంది. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఏ సినిమా సాధించనంత వసూళ్లు ఈ చిత్రం సాధించింది. మొదటిసారి ఈ హీరో రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇక విడుదలై రెండు వారాలు అవుతున్నప్పటికీ.. గడిచిన 24 గంటల్లో బుక్ మై షో లో 1,70,000 టికెట్స్ అమ్ముడైనట్టు చిత్ర బృందం ప్రకటించింది. విడుదలైనప్పటి నుంచే థియేటర్ వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టడంతో 220+ షోలను సైతం చిత్ర బృందం అదనంగా ప్రకటించింది. ఆంధ్రా, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో ఐదో రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది ‘సంక్రాంతికి వస్తున్నాం’.
ALSO READ : హాలీవుడ్ రేంజ్‌లో ‘జైలర్ 2’.. మేకర్స్ మాస్ ప్లానింగ్ అదుర్స్.!
కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో సైతం మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా విక్టరీ వెంకటేష్ కెరియర్ లోనే ఆల్ టైమ్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అమెరికాలో సైతం మంచి వసూలు సాధించిన ఈ సినిమా.. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 2.6 మిలియన్ డాలర్లను తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే అక్కడ 3 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరే ఛాన్స్ ఉన్నట్టు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తెలిపింది. ఇక ఈ సినిమా జోరు చూస్తుంటే ఇప్పటివరకు తెలుగు సినిమాలు రికార్డ్ చేసిన అన్ని రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని అక్కడ తెలుగు అభిమానులు భావిస్తున్నారు.
ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలను దాటి సంక్రాంతికి వస్తున్నాం హిట్ టాక్ తో దూసుకుపోవటమేకాకుండా.. వసూళ్లపరంగా కూడా ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక సీనియర్ హీరోల్లో కేవలం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా నిలవగా ఇప్పుడు ఆ జాబితాలో విక్టరీ వెంకటేష్ కూడా చేరిపోయారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయకులుగా కనిపించారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఈ సినిమా ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాను దిల్ రాజు తెరకెక్కించిన సంగతి తెలిసిందే.