ఆరోగ్యకరమైన ఆహారాలలో సలాడ్ తినే పద్ధతి ఒకటి. ఈ సలాడ్లలో ఎక్కువగా టమోటోలు, కీరా దోసకాయ ముక్కలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని తినడం వల్ల పొట్టకు ప్రశాంతంగా అనిపిస్తుందని, ఎన్నో పోషకాలు అందుతాయని అంటారు. అయితే ఈ రెండింటి కాంబినేషలో సలాడ్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. ఈ రెండు కూరగాయలు కలిపి తినడం వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుందని వివరిస్తున్నారు.
టమోటాలు, దోసకాయలు వివిధ రకాల జీర్ణ లక్షణాలను కలిగి ఉంటాయి. టమోటాలు ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి. జీర్ణం కావడానికి పొట్టలో మరింత ఆమ్లాలు అవసరం పడతాయి. ఇక దోసకాయలు ఆల్కలీన్‌గా పరిగణిస్తారు. అంటే వీటికి ఆమ్లాలు తక్కువ అవసరం పడతాయి. జీర్ణక్రియ సమయంలో టమోటోలు జీర్ణం కావడానికి ఎక్కువ ఆమ్లాలు అవసరమైతే, దోసకాయకు తక్కువ ఆమ్లాలు అవసరం పడతాయి.
కాబట్టి దోసకాయ, టమోటోలు కలిపి తినడం వల్ల ఆమ్లత తటస్థీకరణం జరుగుతుంది. దీనివల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. కొంతమంది సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగి ఉంటారు. ఇది ఉబ్బరాన్ని, గ్యాస్టిక్ సమస్యలకు కారణం అవుతుంది. అంతేకాదు ఈ రెండింటి కాంబినేషన్లో సలాడ్ తినడం వల్ల పోషక విలువలు కూడా తగ్గిపోతాయి. ఈ ప్రభావం వల్ల శరీరం విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శోషణను తగ్గించుకుంటుంది.
ఆయుర్వేదంలో కూడా బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ వల్ల శరీర సమతుల్యత ప్రభావితం అవుతుందని చెబుతారు. ఆయుర్వేదం దోసకాయలను శీతలీకరణ పదార్థాలుగా చెబుతుంది. ఇక టమోటోలు వేడి చేసే ఆహారాలుగా పరిగణిస్తుంది. చలువ చేసే ఆహారాలు, వేడెక్కే ఆహారాలను కలిపి తినడం వల్ల శరీరంలోని అంతర్గత సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల జీర్ణవ్యవస్థలో అసౌకర్యంగా ఉంటుంది. ఆయుర్వేదం కూడా ఇలాంటి ఆహారాలను కలిపి తినడాన్ని వ్యతిరేకిస్తుంది.
టమోటోలు, దోసకాయలు కలిపి తినడం వల్ల మంచి రుచి వస్తుంది. కానీ ఆ రెండు కలిపి తినడం వల్ల ఎలాంటి ఉపయోగము శరీరానికి ఉండదు. పోషకాలను శరీరం పీల్చుకోలేదు. దోసకాయలు తేలికపాటిగా నీటితో కలిగి ఉంటాయి. అవి హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి కీరా దోసకాయలతో టమోటోలను జత చేసి తినకపోవడమే మంచిది. టమోటోలతో కలిపి తినాలనిపిస్తే అవకాడో, క్యాప్సికం వంటివి తినాలి. బెల్ పెప్పర్స్ బయట దొరుకుతాయి. ఎరుపు, పసుపు రంగులో ఉండే బెల్ పెప్పర్స్ తినడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది.
టమోటోలు, దోసకాయలు కలిపి తినడం వల్ల కొందరిలో తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. గ్యాస్ ఉబ్బరం, కడుపు ఉబ్బరం, పొట్ట అసౌకర్యంగా ఉండడం, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటివి వస్తాయి. దోసకాయలలో ఉండే నీరు, టమోటాల్లో ఉండే ఆమ్లము పొట్టను ఇబ్బంది పెడుతుంది. ఈ రెండు కలిపి శరీరాన్ని ఇబ్బందికి గురిచేస్తుంది.