Railway Travel Concession Scheme 2025: తమిళనాడు ప్రభుత్వ ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్ మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. కళాకారులకు రైలు ప్రయాణంలో డిస్కౌంట్లు అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సోలో ఆర్టిస్టులతో పాటు ముగ్గురి కంటే ఎక్కువ మంది కళాకారులు ప్రదర్శన కోసం వెళ్తున్నట్లు అయితే, ప్రయాణ ఛార్జీలో 75శాతం వరకు రాయితీ అందిస్తున్నది. ఇందుకోసం రైల్వే ట్రావెల్ కన్సెషన్ స్కీమ్ 2025ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రాయితీ ద్వారా కళాకారులు రైలులో ప్రయాణించేటప్పుడు టికెట్ ఛార్జీల నుంచి భారీగా తగ్గింపుపొందే అవకాశం ఉంటుంది. ఈ రాయితో కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏ అర్హతలు ఉండాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రాయితీ కోసం కావాల్సిన అర్హత
ఈ పథకం ద్వారా కళాకారులు సెకెండ్ క్లాస్ ఛార్జీల మీద 75% తగ్గింపు, ఫస్ట్ క్లాస్ ఛార్జీల మీద 50% తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది. భారతీయ రైల్వే మార్గదర్శకాల ప్రకారం.. ప్రదర్శనకు వెళ్లే ప్రాంతం 300 కి.మీ కంటే ఎక్కువగా ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకాన్ని పొందే వారిలో ఒక్క కళాకారుడు లేదంటే ముగ్గురు కంటే ఎక్కువ మంది సభ్యులతో కూడిన గ్రూప్ లు వెళ్లాల్సి ఉంటుంది.
కావాల్సిన డాక్యుమెంట్స్
రైలు టికెట్ రాయితీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సి డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ కళాకారుల బయో-డేటా
⦿ గుర్తింపు కార్డు
⦿ రైలు టికెట్
⦿ కార్యక్రమ నిర్వాహకుల నుంచి ఈవెంట్ ను నిర్థారించే ప్రకటన.
⦿ డిపార్ట్ మెంట్ అడిగే ఏవైనా అదనపు డాక్యుమెంట్స్
Read Also: విమాన ధరలకు రెక్కలు.. కళ్లు మూసుకుంటున్న ప్రభుత్వం, కుంభమేళాపై భారీ ఎఫెక్ట్!
రాయితో పొందేవారు ఏం చేయాలంటే?
రైల్వే టికెట్ రాయితీ కోసం అప్లై చేసుకోవాలనుకునే వారు తమిళనాడు ఇయల్ ఇసై నాటక మండ్రం కార్యాలయాన్ని సందర్శించాలి. అక్కడ ఫారమ్ తీసుకుని ఫిల్ చేయాలి. అప్లికేషన్ ను ప్రాసెస్ చేసిన తర్వాత, మండ్రం కన్సెషన్ సర్టిఫికేట్ జారీ చేస్తుంది.
⦿ పనివేళల్లో మండ్రం కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ సిబ్బంది నుంచి రైల్వే టికెట్ రాయితీ కోసం దరఖాస్తు ఫారమ్‌ను అడిగి తీసుకోవాలి.
⦿ ఫారమ్‌లో అవసరమైన అన్ని వివరాలను ఫిల్ చేయాలి. అప్లికేషన్ కు పాస్ పోర్ట్ సైజు ఫోటోను అంటించండి. అప్లికేషన్ ఫారమ్ మీద మీ సంతకం చేయండి. అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లికేషన్ కు యాడ్ చేయండి.
⦿ తమిళనాడు ఇయల్ ఇసై నాటక మండ్రంకు పత్రాలతో పాటు పూర్తి చేసిన ఫారమ్ ను అందించండి.
⦿ అప్లికేషన్ ఇచ్చిన తేదీ, టైమ్, గుర్తింపు సంఖ్యను కన్ఫార్మ్ చేసేలా కార్యాలయం నుంచి రసీదు తీసుకోండి.
అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత టికెట్ మీద రాయితీ పొందే అవకాశాన్ని అందిస్తుంది తమిళనాడు ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్ మెంట్. మీరు ప్రయాణించే క్లాసును బట్టి 75 శాతం నుంచి 50 శాతం వరకు రాయితీ పొందే అవకాశం ఉంటుంది.
Read Also: హైదరాబాద్ నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు, సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ న్యూస్!