BigTV English

Coconut Oil: రోజూ 1 టీ స్పూన్ కొబ్బరి నూనె తాగితే.. ఇన్ని లాభాలా ?

Coconut Oil: రోజూ 1 టీ స్పూన్ కొబ్బరి నూనె తాగితే.. ఇన్ని లాభాలా ?

Coconut Oil: కొబ్బరి నూనె మన చర్మానికి, జుట్టుకు చాలా రకాలుగా ప్రయోజనాలు అందిస్తుందని చెబుతారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో.. కొబ్బరి నూనెను వంటకాల తయారీలో కూడా వాడతారు. కానీ కొబ్బరి నూనె నేరుగా తాగడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా ? ప్రతి రోజు ఉదయం ఒక చెంచా కొబ్బరి నూనె కలిపిన ఒక గ్లాసు నీరు తాగడం వల్ల బోలెడు లాభాలుంటాయి. మరి నిజంగానే కొబ్బరి నూనె తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయా ? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఇందుకే.. కొబ్బరి నూనె ఆరోగ్యకరం:

కొబ్బరి నూనె అనేక లక్షణాలతో నిండి ఉంటుంది. ఆయుర్వేదంలో దీనిని ఔషధంగా పరిగణిస్తారు. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి , శక్తి స్థాయిలను పెంచడానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. వీటిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ సహజ నూనెలో విటమిన్ సి, విటమిన్ ఇ, మెగ్నీషియం , పొటాషియం పుష్కలంగా ఉంటాయి.


శక్తి స్థాయి పెరుగుతుంది:
ప్రతి రోజు ఉదయం ఒక చెంచా కొబ్బరి నూనె తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఇది మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటుంది. ఫలితంగా ఇది మీకు రోజంతా శక్తిని ఇస్తుంది. మీ రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి ఇది ఒక గొప్ప ఎంపిక. ఇది శరీరంలోని బలహీనతలను కూడా తొలగిస్తుంది.

ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది :
కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఈ రెండూ మిమ్మల్ని వైరస్, బాక్టీరియల్ , ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. ఈ విధంగా మీరు జలుబు, దగ్గు , జ్వరం నుండి సురక్షితంగా ఉంటారు. ఇది మాత్రమే కాదు.. ఈ నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా మీరు అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.

ఒత్తిడిని తొలగిస్తుంది:
కొబ్బరి నూనె మీ శారీరక ఆరోగ్యానికే కాదు.. మీ మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది శరీరంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా మీ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా.. జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మీరు అనేక తీవ్రమైన మానసిక వ్యాధుల నుండి దూరంగా ఉంటారు. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.

బరువు తగ్గడం:
కొబ్బరి నూనె తాగడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ నూనె మీ జీవక్రియను పెంచుతుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోదు. ఫలితంగా బరువు తగ్గడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.

జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది:
కొబ్బరి నూనెను ప్రతి రోజు ఒక చెంచా తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అంతే కాకుండా మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నిజానికి.. కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. ఇది అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కూడా రాకుండా చేస్తుంది.

కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుదల:
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి.. నూనె తీసుకోవడం తగ్గించమని డాక్టర్లు సలహా ఇస్తారు. కానీ కొబ్బరి నూనె ఒక చెంచా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. దీని కారణంగా.. సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Also Read: వీళ్లు చియా సీడ్స్ అస్సలు తినకూడదు !

మధుమేహం:
కొబ్బరి నూనె తాగడం ద్వారా మీరు డయాబెటిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల భయాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఈ నూనెలో చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని నిర్వహించడంలో సహాయపడతాయి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×