Tea: టీని ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. మనలో ఎక్కువ మంది టీతోనే ఉదయాన్ని ప్రారంభిస్తారు. మరి కొంత మంది అలసట తీరే వరకు కప్పు టీపై ఆధారపడతారు. చాలా భారతీయ కుటుంబాల్లో బలమైన టీకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇదిలీ ఉంటే చాలా మంది టీ తయారు చేయడంలో వివిధ పద్దతులన పాటిస్తుంటారు.
టీ ఎక్కువ సేపు మరగపెడితే టేస్ట్ పెరుగుతుందనే భావన కూడా ఉంటుంది. కానీ ఇలా తయారు చేసే స్ట్రాంగ్ టీ మీ ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో తెలుసా. అవును, ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) టీ ప్రియులను హెచ్చరిస్తూ తన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పాలతో పాటు టీని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ శోషణకు ఆటంకం కలుగుతుంది. అంతే కాదు, ఎక్కువసేపు మరిగించిన టీ తాగడం వల్ల కాలేయం, గుండెపై కూడా చెడు ప్రభావం పడుతుంది. స్ట్రాంగ్ టీని పాలతో కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రధాన హాని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రాంగ్ టీ తాగే వారు జాగ్రత్తగా ఉండాలి. అది తెలియకుండానే ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. టీ ఎక్కువసేపు మరిగించడం టీ తాగడం వల్ల అధిక బీపీ సమస్య
ఎవస్తుంది. అంతే కాకుండా ఎక్కువసేపు మరిగించిన టీ త్రాగడం లేదా వేడి చేసిన తర్వాత చాలాసార్లు తాగినా, దాని నుండి టానిన్లు విడుదలవుతాయి. ఇది రక్తపోటును పెంచడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా రక్తప్రసరణపై కూడా ప్రభావాన్ని చూపుతుంది.
ఇనుము, కాల్షియం శోషణ నిరోధిస్తుంది:
స్ట్రాంగ్ టీలో ఉండే టానిన్లు శరీరంలోని పోషకాలను, ముఖ్యంగా ఐరన్ , కాల్షియం శోషణను నిరోధిస్తాయి. టీ ఎక్కువగా తీసుకునే వారికి ఎముకలు, దంతాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు, అతిగా స్ట్రాంగ్ టీ తాగడం వల్ల రక్తహీనత కూడా వస్తుంది.
పోషకాలు తొలగిపోతాయి:
మీరు మిల్క్ టీని ఎక్కువగా మరగబెట్టినప్పుడు అందులో ఉండే అవసరమైన యాంటీఆక్సిడెంట్లు మొదలైనవన్నీ నాశనం అవుతాయి. మీరు మిల్క్ టీని ఎంత ఎక్కువగా మరిగిస్తే టీలోని ఎసిటిక్ గుణం అంత పెరిగి జీర్ణం కావడం కష్టమవుతుంది.
Also Read: చలికాలంలో రాత్రి పూట బెల్లం పాలు త్రాగితే.. మతిపోయే లాభాలు
యాంటీ ఆక్సిడెంట్లు తగ్గుతాయి:
టీ ఎక్కువ సేపు మరగబెట్టి తాగడం వల్ల ఒత్తిడిని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలైన థెఫ్లావిన్, కాటెచిన్స్ అన్నీ నాశనం అవుతాయి. అంతే కాకుండా టీని ఎక్కువసేపు మరగబెట్టి తాగితే దానిలోని ఎసిటిక్ గుణం కూడా పెరిగి జీర్ణం కావడం కష్టమై టీకి చేదు రుచి వస్తుంది.
జీర్ణ సమస్యలు:
ఎక్కువ మరిగించిన టీని తాగడం వల్ల మనిషికి అనేక జీర్ణ సమస్యలు వస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, అటువంటి టీని అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో వాపు, గ్యాస్, నొప్పి, అసిడిటీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరెన్నో ఆరోగ్య సమస్యలు రావడానికి ఇది కారణం అవుతుంది.