Abhishek Bachchan – Aishwarya Rai.. బాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న జోడీలలో ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai), అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan)జోడీ కూడా ఒకటి. ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఈ జోడీ అనూహ్యంగా విడాకులు తీసుకోబోతోంది అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనికి తోడు అటు అభిషేక్ బచ్చన్ ఇటు ఐశ్వర్యరాయ్ ఇద్దరూ కూడా అలాగే ప్రవర్తించారు. ముఖ్యంగా అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకలలో కూడా ఎవరికి వారు ఫోటోలకు ఫోజులిచ్చారు.కానీ జంటగా కనిపించలేదు.
రూమర్స్ కి చెక్..
దీనికి తోడు విదేశాల నుండి ఐశ్వర్యరాయ్ తన కూతురితో వచ్చినప్పుడు వీరిని రిసీవ్ చేసుకోవడానికి అభిషేక్ బచ్చన్ రాకపోవడంతో మరిన్ని వార్తలు జోరు అందుకున్నాయి. అయితే ఈ వార్తలపై ఖండిస్తూ ఎప్పటికప్పుడు ఐశ్వర్య, అభిషేక్ స్పందించినా..ఎవరూ కూడా రూమర్స్ ని ఆపలేదు. దీనికి తోడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)కూడా ఈ వార్తలపై ఫైర్ అయ్యారు. అయినా సరే రూమర్స్ ఆగకపోయే సరికి ఇక ఏకంగా ఒక ఫోటో షేర్ చేసి అందరి నోరు మూయించారు.
జంటగా కనిపించిన ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్..
విడాకుల పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ గురువారం రాత్రి ముంబైలో సన్ ఎన్ సాండ్ హోటల్లో జరిగిన ఒక వివాహ రిసెప్షన్ లో కలిసి మెరిసారు. ఈవెంట్లో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ బాలీవుడ్ జంట గురువారం రాత్రి పార్టీలో ఆయేషా అర్జున్, అనురంజన్ తో పాటు ఇతరులతో కలిసి కనిపించారు. అలాగే ఐశ్వర్య తల్లి బృందారాయ్ కూడా ఈవెంట్ కి హాజరైనట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాత అనూ రంజన్ షేర్ చేసిన ఈ ఫోటోలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, బృందారాయ్ ప్రొఫైల్ పార్టీలో సెల్ఫీకి ఫోజులు ఇవ్వడం జరిగింది.
క్లాసీ లుక్ లో కనిపించిన జంట..
ఇందులో ఐశ్వర్యరాయ్ సాంప్రదాయంగా బ్లాక్ డ్రెస్ లో అద్భుతంగా కనిపించింది. దానికి మ్యాచింగ్ చేస్తూ బ్లాక్ సూట్ లో చాలా క్లాసీ గా కనిపించారు అభిషేక్ బచ్చన్. ఇలా మొత్తానికైతే ఒక్క ఫోటోతో ఈ జంట విడాకులు తీసుకోలేదు, కలిసే ఉన్నారు అంటూ క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పటికైనా ఈ విడాకుల రూమర్స్ ఆగిపోతాయేమో చూడాలి.
ఐశ్వర్యారాయ్ సినిమాలు..
ఇక ఐశ్వర్యరాయ్ సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు తెలుగు, తమిళ్ అంటూ తేడా లేకుండా వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె, హిందీలో బాలీవుడ్ క్వీన్ గా పేరు దక్కించుకుంది. ముఖ్యంగా ఈమె నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన ఈమె అనుకోకుండా ‘పొన్నియిన్ సెల్వన్’ అనే సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో కూడా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా ఇప్పుడు విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టారు అని చెప్పవచ్చు.