Tomato Side Effects: టమాటోలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఉండే ఇతర విటమిన్లు చర్మ వ్యాధులను అలాగే గుండె జబ్బులను నయం చేయడంలో సహాయపడతాయి. కానీ టమాటోలను పరిమితికి మించి తీసుకుంటుంటే.. మీకు అనేక సమస్యలను కలిగిస్తుంది. టమాటోలు ఎక్కువగా తినడం వల్ల మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటోలు ప్రతి సీజన్‌లో దొరికే కూరగాయ. టమాటోలు వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. ఇవి ఆహారానికి మంచి రుచిని అందించడమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. టమాటోలో విటమిన్ సి మంచి మొత్తంలో ఉంటుంది. అలాగే ఇతర విటమిన్లు చర్మ వ్యాధులను అలాగే గుండె జబ్బులను నయం చేయడంలో సహాయపడతాయి. కానీ మీరు టమాటోలను పరిమితికి మించి తీసుకుంటుంటే ఇతర సమస్యల బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.
టమాటోలు ఎక్కువగా తింటే ?
టమాటోలలో హిస్టామిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో అలెర్జీలకు కారణమవుతుంది. మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే టమాటోలకు దూరంగా ఉండాలి. టమోటాను ఎక్కువగా తీసుకుంటే.. గొంతు నొప్పి, దగ్గు, జలుబు, తామర వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీంతో పాటు మీరు ఇప్పటికే శరీరంలో ఏదైనా అలెర్జీతో బాధపడుతుంటే.. మాత్రం టమాటోలు అస్సలు తినకూడదు.
కిడ్నీలో రాళ్ళు:
టమాటోలను ఎక్కువగా తీసుకుంటే అందులో ఉండే కాల్షియం, ఆక్సలేట్ మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి కారణమవుతాయి. మీరు ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతుంటే టమాటోలు తినకుండా ఉండాలి.
జీర్ణ సమస్య:
జీర్ణ సమస్యలు ఉంటే, మీరు ఆహారాన్ని జీర్ణం చేసుకోలేరు. ఆహారం తిన్న తర్వాత మీ కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అంతే కాకుండా గ్యాస్ ఏర్పడుతుంది. ఇలాంటి వారు టమాటోలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. టమాటోలు వాటి పుల్లని రుచి కారణంగా సహజంగానే ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. టమాటోలు ఎక్కువగా తీసుకుంటే.. ఇవి మీ గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు కలిగిస్తాయి.
కీళ్లలో వాపు:
టమాటోలలో లభించే హిస్టామిన్ , సోలనిన్ వంటి సమ్మేళనాలు శరీరంలో కాల్షియం ఉత్పత్తిని పెంచుతాయి. అంతే కాకుండా ఇది కీళ్లలో వాపుకు కారణమవుతుంది. కీళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు టమాటోలను తీసుకోవడం తగ్గించాలి.
చర్మం రంగు:
టమాటోలు ఎక్కువగా తినడం వల్ల మీ ముఖం నల్లగా మారుతుంది. అంతే కాకుండా టమాటోల వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. టమోటాలలో ఉండే మూలకాలు చర్మం యొక్క లైకోపెనోడెర్మియాను ప్రేరేపిస్తాయి. ఇది రక్తంలో లైకోపీన్ స్థాయిని పెంచుతుంది. దీని కారణంగా చర్మం యొక్క మెరుపు తగ్గుతుంది. అంతే కాకుండా రంగు కూడా పాలిపోతుంది.
Also Read: నల్ల ద్రాక్ష తింటే.. మతిపోయే లాభాలు !
టమాటోలు తిన్న తర్వాత మీకు ఏదైనా సమస్య ఎదురైతే, వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. వీటిని తినడానికి ముందు బాగా ఉడికించాలి. ఇది టమాటోలోని ఆమ్లతను తగ్గిస్తుంది. అంతే కాకుండా సులభంగా జీర్ణం అయ్యేలాగా చేస్తుంది.