Thyroid Side Effects: ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి నెలను థైరాయిడ్ అవగాహన నెలగా ప్రకటించింది. WHO ప్రకారం, థైరాయిడ్ వ్యాధులు తీవ్రమైనవి అంతే కాకుండా ప్రాణాంతకమైనవి కూడా. వీటి లక్షణాల ఆధారంగా ముందుగానే ఈ వ్యాధులను గుర్తించవచ్చు. WHO ప్రకారం చెడు జీవనశైలి థైరాయిడ్‌కు ప్రధాన కారణం. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కూడా కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
థైరాయిడ్ అనేది మానవ శరీరంలో ఒక చిన్న, కానీ శక్తివంతమైన గ్రంధి. దానిని విస్మరించడం చాలా హానికరం. ఎందుకంటే ఇది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది.చెడు జీవనశైలి థైరాయిడ్ రావడానికి ప్రధాన కారణం. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జనవరి నెలను థైరాయిడ్ అవగాహన నెలగా ప్రకటించింది.
WHO ప్రకారం థైరాయిడ్ సంబంధిత వ్యాధులు తీవ్రమైనవి అంతే కాకుండా ప్రాణాంతకమైనవి కూడా వీటికి చికిత్స కూడా ఉంటుంది. లక్షణాల ఆధారంగా ముందుగానే దీనిని గుర్తించవచ్చు. థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉండే చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఇది శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి పని చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు హృదయ స్పందన, శ్వాస, బరువు, జీర్ణక్రియ తో పాటు మానసిక స్థితి వంటి వాటిని ప్రభావితం చేస్తుంది.
2 రకాల సమస్యలు:
థైరాయిడ్ అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి అయితే.. దానిని హైపర్ థైరాయిడిజం అంటారు. దీని వల్ల శరీరం యొక్క అనేక విధులు వేగవంతం అవుతాయి. దీని లక్షణాలు చిరాకు, అధిక చెమట, భయము, హృదయ స్పందన రేటు పెరగడం, బరువు తగ్గడం, పెరిగిన ఆకలి, కండరాల బలహీనతతో పాటు కండరాల నొప్పి. థైరాయిడ్ అవసరమైన దానికంటే తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే, దానిని హైపోథైరాయిడిజం అంటారు. దీని కారణంగా శరీరంలోని అనేక విధులు మందగిస్తాయి.
వయస్సు, అయోడిన్ లోపం:
చెడు జీవనశైలి, క్రమరహిత ఆహారపు అలవాట్లు వంటి అనేక కారణాలు దీనికి అతిపెద్ద కారణాలు. ఇదే కాకుండా, దీర్ఘకాలిక ఒత్తిడి, వృద్ధాప్యం, అయోడిన్ లోపం, వైరల్ ఇన్ఫెక్షన్, వంశపారంపర్య కారణంగా కూడా థైరాయిడ్ వస్తుంది. ఇది పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, గర్భం దాల్చిన తర్వాత శారీరక మార్పులు, డిప్రెషన్ వంటి అనేక ఇతర కారణాలు దీనికి కారణం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా 27 కోట్ల మంది, భారతదేశంలో దాదాపు 4 కోట్ల మంది థైరాయిడ్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
Also Read: బట్టతలపై కూడా జుట్టు రావాలంటే.. ఇలా చేయండి !
ఇదే కాకుండా మరో సర్వే ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారిలో 13 శాతం మంది, 19 ఏళ్లలోపు 5 శాతం మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి అతి పెద్ద కారణం సక్రమంగా లేని జీవనశైలి అనే వైద్యులు చెబుతున్నారు. థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ముందుగానే దీనిని గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల సమస్య నుండి బయటపడవచ్చు.