Egg Freshness Test: సాధారణంగా చాలా రోజులు నిల్వ ఉన్న గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకవేళ చెడిపోయిన గుడ్డు తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనం గుడ్లు కొనేటప్పుడు మంచివా? కాదా? అని సింఫుల్ గా తెలుసుకోవచ్చు. అదీ పగలగొట్టకుండానే. ఇంతకీ ఆ టెక్నిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
చల్లటి నీళ్లలో ఎగ్స్ టెస్ట్!
గుడ్లు మంచివా? కాదా? అని తెలుసుకునే సింపుల్ టిప్ వాటర్ టెస్ట్. పాత్రలో చల్లటి నీళ్లు తీసుకోవాలి. వాటిలో ఎగ్స్ వేయాలి. గుడ్డు నీళ్లలో వేయగానే పూర్తిగా మునిగిపోతే.. దానిని తాజాగా గుడ్డుగా పరిగణించాల్సి ఉంటుంది. ఫామ్ నుంచి తీసుకొచ్చి 10 రోజుల లోపే అవుతుందని అర్థం. ఒకవేళ గుడ్డు కొంత భాగం తేలి ఉంటే ఆ గుడ్డు ఫామ్ నుంచి వచ్చి మూడు వారాలు అవుతుందని గుర్తించవచ్చు. వీటిని కూడా అత్యవసరం అనుకుంటే తినవచ్చు. ఒకవేళ గుడ్డు పూర్తిగా నీళ్లలో తేలితే అది కోడి నుంచి వచ్చి సుమారు నెలకు పైనే అవుతుంది అర్థం చేసుకోవాలి.వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
నిజానికి ఎగ్స్ ఫ్రెష్ గా ఉన్నాయో? లేదో? తెలుసుకునేందుకు ఈ టెస్ట్ ఫర్వాలేదు. కానీ, గుడ్డు మంచిదా? కాదా? అని తెలుసుకునేందుకు ఈ పరీక్ష నూటికి నూరు శాతం మంచిదే అని చెప్పలేం. కొన్ని గుడ్లు ఎక్కవ రోజులు నిల్వ ఉన్నప్పటికీ చెడిపోవు. వాటిని చక్కగా ఉడికించి తినవచ్చు.
గుడ్డు ఊపి చూడవచ్చు!
గుడ్లు మంచివా? కాదా? అనేవి మరో పరీక్ష ద్వారా కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. గుడ్డును పట్టుకుని ఊపినప్పుడు శబ్దం వస్తే ఆ గుడ్డు చెడిపోయినట్లు గుర్తించాలి. ఒకవేళ ఊడినట్లు శబ్దం వస్తే ఆ గుడ్డు చాలా రోజులదని తెలుసుకోవచ్చు. ఆ గుడ్డును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. ఇలాంటి గుడ్లు బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది. వీటిని తినడం వల్ల పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఎన్ని రోజుల వరకు గుడ్లు తినొచ్చు?
గుడ్లను సరైన పద్దతుల ద్వారా నిల్వ చేస్తే, సుమారు 4 వారల వరకు తినవచ్చు. కొన్నిసార్లు నెల వరకు తినవచ్చు. ఆ తర్వాత తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు.
గుడ్లు చెడిపోకుండా ఎలా నిల్వ చేయాలంటే?
ఈ రోజుల్లో చాలా మంది గుడ్లను ఫ్రిజ్ లలో నిల్వ చేస్తున్నారు. గుడ్లు ఉంచిన ఫ్రిజ్ లో ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. గుడ్లను స్టోర్ నుంచి తీసుకొచ్చిన పేపర్ ప్యాక్ ను అలాగే ఫ్రిజ్ లో ఉంచాలి. వాటిని బయటకు తీసి ఫ్రిజ్ డోర్ లో పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిజ్ డోర్ లో పెడితే ఉష్ణోగ్రతలు మారుతూ ఉంటాయి. ఈ కారణంగా గుడ్ల ప్రెష్ నెస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక గుడ్లను ఫ్రిజ్ లో నుంచి తీసి వెంటనే వాడకూడదు. ఆ గుడ్లను గది ఉష్ణోగ్రత వద్ద కాసేపు ఉంచాలి. ఫ్రెష్ ఎగ్స్ ను గది ఉష్ణోగ్రత దగ్గర గుడ్లను సుమారు రెండు వారాల వరకు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే.. గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కడిగి నిల్వ చేయకూడదు. అలా చేయడం వల్ల కొన్ని గుడ్లలోకి వాటర్ వెళ్లి అందులో బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది.
Read Also: సమ్మర్ లో ఏసీ వాడుతున్నారా? కచ్చితంగా ఈ 3 విషయాలు తెలియాల్సిందే!