BigTV English

OTT Movie : భార్య చెల్లిపై భర్త కన్ను… డబ్బు కోసం డేటింగ్ యాప్‌ లో పాడు పనులు…

OTT Movie : భార్య చెల్లిపై భర్త కన్ను… డబ్బు కోసం డేటింగ్ యాప్‌ లో పాడు పనులు…

OTT Movie : బాలీవుడ్ అభిమానులకు ఓటీటీ లో అదిరిపోయే ఒక మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో అక్కా,చెల్లెళ్ళు తమ జీవితంలో అసంతృప్తిగా ఉన్న వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అక్కకి పెళ్లి జరిగినా సంతోషం ఉండదు. చెల్లి కొత్త బాయ్ ఫ్రెండ్ తో చాలా దూరం వెళ్తుంది. ఈ ఇద్దరి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఇందులో రొమాన్స్, భావోద్వేగాలు, సమాజంను ఎదుర్కొనే సన్నివేశాలు ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ మూవీ పేరు ‘డాలీ కిట్టీ ఔర్ వో చమక్తే సితారే’ (Dolly Kitty Aur Woh Chamakte Sitare). 2019 లో వచ్చిన ఈమూవీకి అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వం వహించారు.  బాలాజీ మోషన్ పిక్చర్స్, ఆల్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ల పై ఏక్తా కపూర్, శోభా కపూర్ దీనిని నిర్మించారు. ఈ చిత్రం మరియు కొంకణ సేన్ శర్మ (డాలీ), భూమి పెడ్నేకర్ (కాజల్) ప్రధాన పాత్రలు పోషించారు.ఈ మూవీ ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

డాలీ అనే మధ్యతరగతి మహిళ, నోయిడాలో తన భర్త అమిత్ తో కలసి ఉంటుంది. వీళ్ళకు ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. ఆమె బయటికి సంతోషంగా కనిపించినా, ఆమె వివాహంలో సంతృప్తి లేకపోవడంతో బాధపడుతుంది. ఆర్థిక ఒత్తిడిని కూడా ఎదుర్కుంటూ ఉంటుంది. ఎందుకంటే వారు కొత్త లగ్జరీ అపార్ట్‌మెంట్ కోసం, డబ్బులు పోగు చేయడానికి కష్టపడుతూ ఉంటారు. డాలీ తన ఆభరణాలను అమ్మడం ద్వారా ఈ ఆర్థిక భారాన్ని ఒక దారికి తెస్తూ వస్తుంటుంది. డాలీ చిన్న చెల్లెలు కాజల్, బీహార్ నుండి నోయిడాకు తన కలలను సాకారం చేసుకోవడానికి వస్తుంది. అయితే, అమిత్ ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడంతో, ఆమె అసౌకర్యంగా ఫీల్ అవుతుంది. ఈ కోపంతో కాజల్ ఇంటిని విడిచిపెట్టి హాస్టల్‌కు వెళ్తుంది. తగినంత అర్హతలు కూడా లేకపోయినా గాని, ఆమె ఉద్యోగం కోసం తిరుగుతుంది.

చివరికి ‘రెడ్ రోజ్ రొమాన్స్’ అనే డేటింగ్ యాప్‌లో కాల్ సెంటర్ ఉద్యోగం స్వీకరిస్తుంది. ఈ ఉద్యోగం ఆమెకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ అది సమాజంలో అంత మంచి పని కాకపోవడంతో, ఆమె దానిని డాలీ కి చెప్పకుండా దాచిపెడుతుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, డాలీ తనకు సెక్సువల్ డిజైర్ లేకపోవడం గురించి ఆలోచిస్తూ, ఒక డెలివరీ బాయ్ అయిన ఒస్మాన్ తో స్నేహం చేస్తుంది. అతనితో ఆమె తన భావోద్వేగాలను పంచుకుంటుంది. ఇదే సమయంలో, కాజల్ తన యాప్ ద్వారా పరిచయమైన ప్రదీప్ తో శృంగార సంబంధం పెట్టుకుంటుంది. డాలీ, కాజల్ ఇద్దరూ సమాజంలోని నీతి నియమాలు, లింగ వివక్ష, వారి సొంత కోరికల కోసం పోరాడుతారు. చివరికి వీళ్ళు  ఎటువంటి జీవితాన్ని గడుపుతారు అనేది తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : ఆంటీలను మాత్రమే ప్రేమించే ఆటగాడు .. పనయ్యాక వీడిచ్చే ట్విస్ట్ కి చుక్కలే

Related News

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి అడుగు పెట్టిన సిరీస్ లు… ఒక్కోటి ఒక్కో జానర్ లో

OTT Movie : తలపై రెడ్ లైన్స్… తలరాత కాదు ఎఫైర్స్ కౌంట్… ఇండియాలో వైరల్ కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

OTT Movie : కాల్ సెంటర్ జాబ్ లో తగిలే కన్నింగ్ గాడు… ఫోన్లోనే అన్నీ కానిచ్చే కస్టమర్లు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

Big Stories

×