Basara Tragedy: బాసరలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగి ఐదుగురు మృతి చెందారు. వీరంతా హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. బాసర సరస్వతీ మాత దర్శనానికి వచ్చిన భక్తులు.. గోదావరిలో స్నానానికి దిగి.. ప్రమాదవ శాత్తు మునిగిపోయారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వెంటనే అక్కడ ఉన్న భక్తులు చూసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్లు, రెస్కూ చేపట్టగా.. నలుగురు మృతి దేహాలను వెలికి తీశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.
మృతదేహాలను 108 అంబులెన్స్2లో ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు.. నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రం వద్ద.. ఆదివారం ఉదయం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా.. ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ నుండి మొత్తం 18మంది బాసరకు.. సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. మృతులంతా హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్, చింతల్ ప్రాంత వాసులుగా గుర్తించారు.
కాగా.. ఇటీవల సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు చిన్నారులు. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలో.. ఈ ఘటన జరిగింది. ఉపాధి హామీ చెరువులో ఈతకు వెళ్లిన చిన్నారులు.. విగత జీవులుగా తిరిగి రావడంతో మూడు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
Also Read: ఎంత దారుణం.. విద్యుత్ తీగ తెగి పడి దంపతులు సజీవదహనం
ఇదిలా ఉంటే.. విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. మట్టి గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. గంట్యాడ మండలం రామవరంలో ఈ ఘటన జరిగింది. కూలి పనికి వెళ్లిన కార్మికులపై మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో కూలీలిద్దరు చనిపోయారు.