మనిషి శరీరంలో కొన్ని భాగాలు నల్లగా ఉంటాయి. కొన్ని సహజ కారణాలతో పాటు పర్యావరణ కారణాల వల్ల నలుపు రంగులో కనిపించే అవకాశం ఉంటుంది. అలా మరడానికి కారణాలు ఎంటి? నిపుణులు ఏం చెప్తున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..
⦿ ఘర్షణ, ఒత్తిడి
బిగుతైన దుస్తులు వేసుకోవడం, నిరంతరం రాసుకోవడం వల్ల ఘర్షణ ఏర్పడుతుంది. ఈ కారణంగా మోకాళ్లు, మోచేతులు, మెడ, చంకలు సహా ఇతర భాగాలు నల్లగా మారుతాయి. ఈ భాగాల్లో చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోతాయి. నమ్మదిగా అవి నలుపు లేదంటే ముదురు రంగులోకి మారుతాయి.
⦿ హైపర్ పిగ్మెంటేషన్
చర్మం అదనపు మెలనిన్ అంటే చర్మ రంగుకు కారణమయ్యే వర్ణ ద్రవ్యం ఎక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు హైపర్ పిగ్మెంటేషన్ సంభవిస్తుంది. ఆ సమయంలో సూర్యరశ్మి, హార్లోన్ల మార్పులు, ఇన్ఫ్లమేషన్ కారణంగా పలు శరీర భాగాలు నల్లరంగులోకి మారే అవకాశం ఉంటుంది.
⦿ చర్మ మృత కణాలు పేరుకుపోవడం
కొన్ని శరీర భాగాలను క్రమం తప్పకుండా ఎక్స్ ఫోలియేట్ చేయాలి. లేకపోతే చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోయి, చర్మం ముదురు రంగులోకి మారుతుంది.
⦿ జన్యు సంబంధ కారణాలు
కొంతమందికి సహజంగా వారి జన్యువుల పరంగా కొన్ని ప్రాంతాలలో ముదురు రంగు చర్మం ఉంటుంది. మెలనిన్ సరఫరా అనేది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. ఇది శరీరం అంతటా చర్మపు రంగులో తేడాలకు కారణం అవుతుంది.
⦿ హార్మోన్ల అసమతుల్యత
అకాంతోసిస్ నైగ్రికన్స్ లేదంటే హార్మోన్ల అసమతుల్యత అనేది చర్మం మందంగా, నల్లగా మారేందుకు కారణం అవుతుంది. ముఖ్యంగా మెడ చుట్టూ, చంకలు, గజ్జల చుట్టూ రంగు మారే అవకాశం ఉంటుంది. మధుమేహం, ఊబకాయం, హార్మోనల్ సమస్యలు కూడా చర్మం రంగు మారడానికి కారణం అవుతుంది.
⦿ షేవింగ్ చేయడం
తరచుగా షేవింగ్ చేయడం వల్ల చర్మ సున్నితత్వం, చర్మ నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అండర్ ఆర్మ్స్, బికినీ లైన్ వంటి ప్రాంతాలలో చికాకు, నల్లబడుతుంది.
⦿ చెమట, పరిశుభ్రత లేకపోవడం
శరీరంలోని ఆయా ప్రాంతాల్లో చెమట ఎక్కువగా రావడం, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల బ్యాక్టీరియా పేరుకుపోయి చర్మం నల్ల రంగులోకి మారుతుంది.
⦿ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్
కొన్ని డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్ లు, హార్ష్ స్కిన్ కేర్ ప్రొడక్టులు చర్మాన్ని చికాకుపెడతాయి. నెమ్మదిగా పిగ్మెంటేషన్ కు దారితీస్తాయి.
Read Also: చిన్న కౌగిలింతతో బోలెడన్ని బెనిఫిట్స్.. హగ్ ఇవ్వండి గురూ!
నల్లటి మచ్చలను ఎలా తగ్గించుకోవాలంటే?
⦿ చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి క్రమం తప్పకుండా ఎక్స్ ఫోలియేషన్ చేయాలి.
⦿ కలబంద, కొబ్బరి నూనెను ఆయా భాగాల్లో పూయాలి.
⦿ చర్మంనల్లబడకుండా నిరోధించడానికి సన్ స్క్రీన్ ఉపయోగించాలి.
⦿ హార్ష్ కెమికల్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగించకూడదు.
⦿ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. హైడ్రేషన్ గా ఉండాలి.
ఒకవేళ చర్మం రంగు మరింత నల్లగా మారితే వెంటనే స్కిన్ కేర్ స్పెషలిస్టులను సంప్రదించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Read Also: ఒక్కో రంగు గులాబీ వెనుక ఒక్కో అర్థం, వాలంటైన్స్ డే వీక్ లో ఏ గులాబీ ఎవరికి ఇవ్వాలంటే?