Minister komatireddy: రానున్న రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. నల్గొండను బంగారు కొండగా మారుస్తామన్నారు. ప్రతీ ఎకరాకు నీళ్లు ఇస్తామన్నారు. ప్రతీ ఇంటికి త్రాగు కచ్చితంగా ఇస్తామని మనసులోని మాట బయటపెట్టారు.
బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా రాబోయే పది రోజుల్లో దాదాపు 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, మే నాటికి లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 70 శాతం పూర్తయిన ఎస్.ఎల్.బీ.సీ సొరంగం పనులను, పదేళ్లు పాలించిన కేసీఆర్ సర్కార్ పక్కన పెట్టిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమెరికాకు వెళ్లి బోరింగ్ స్పేర్ పార్ట్స్ తెప్పించడం జరుగుతుందన్నారు మంత్రి. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంగోపలాయిపల్లి శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తిరు కళ్యాణంలో పాల్గొని స్వయంగా స్వామివారి పల్లకి మోశారాయన.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఆలయానికి కూతవేటు దూరంలో బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్.ఎల్.బీ.సీ సొరంగాన్ని మంజూరీ చేయించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో సొరంగం పనులు పూర్తి చేస్తామన్నారు.
ALSO READ: ఆలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు!
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కృష్ణమ్మను వేణుగోపాలస్వామి చెంతకు చేరుస్తామని తెలియజేశారు. తెలంగాణపై వేణుగోపాల స్వామివారి ఆశీస్సులతో పాడి పంటలు, సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వేడుకోవడం జరిగిందన్నారు. చెరువు గట్టు ఆలయం అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే వేణుగోపాల స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. చెరువుగట్టు జాతర తర్వాత ఈ ప్రాంతంలో రెండో పెద్ద జాతర వేణుగోపాలస్వామి వారి జాతర అని తెలిపారు.