Sekhar Kammula: శేఖర్ కమ్ముల(Sekhar Kammula) తాజాగా కుబేర సినిమా(Kuberaa) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈయన గత పాతిక సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నప్పటికీ చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా, ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇలా వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న శేఖర్ కమ్ముల కుబేర సినిమా సక్సెస్ కావడంతో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను అందరితో పంచుకున్నారు. ఇక శేఖర్ కమ్ముల ఇప్పటికే ఎంతోమంది యంగ్ హీరోలకు మంచి సూపర్ హిట్ సినిమాలను అందించారు.
గ్లామరస్ లవ్ స్టోరీ…
ఈయన ప్రేమ కథ సినిమాలను ఎంతో అద్భుతంగా తెరపై చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. శేఖర్ కమ్ముల సినిమాలు వస్తున్నాయి అంటే సినిమా పై భారీ స్థాయిలోనే అంచనాలు ఉండటమే కాకుండా, అంచనాలకు అనుగుణంగా సినిమా కూడా ఉంటుంది. ఇక కుబేర సినిమా అనంతరం ఈయన మరొక గ్లామరస్ లవ్ స్టోరీ(Love Story) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఇక ఈ విషయం గురించి స్వయంగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శేఖర్ కమ్ముల వెల్లడించారు.
విజయ్ దేవరకొండను ఫిక్సయిన శేఖర్ కమ్ముల..
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు యాంకర్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మళ్లీ మీరు ప్రేమ కథా చిత్రం కనుక చేస్తే ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు? అనే ప్రశ్న ఎదురయింది ఈ ప్రశ్నకు శేఖర్ కమ్ముల సమాధానం చెబుతూ తాను లవ్ స్టోరీ కనుక చేస్తే కచ్చితంగా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో చేస్తానని సమాధానం చెప్పారు. ఇలా విజయ్ దేవరకొండతో లవ్ స్టోరీ సినిమా చేస్తానని చెప్పడంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు హిట్ రావడం గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఇక ఇప్పటివరకు విజయ్ దేవరకొండ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ఒక సినిమా కూడా రాలేదనే చెప్పాలి.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్…
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో పూర్తిస్థాయి సినిమాలో విజయ్ దేవరకొండ నటించకపోయినా, ఆయన దర్శకత్వం వహించిన “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” (Life Is Beautiful) అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో విజయ్ దేవరకొండ నటించి సందడి చేశారు. ఈ సినిమా 2012 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి అమల కూడ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు కానీ త్వరలోనే కచ్చితంగా ఒక మంచి ప్రేమ కథ చిత్రంతో శేఖర్ కమ్ముల విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండకు ఇటీవల కాలంలో అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ మాత్రం రాలేదు. ఈయన చివరిగా అర్జున్ రెడ్డి సినిమాతో హిట్ కొట్టారు, ఆ స్థాయిలో తదుపరి ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read: Vijay Devarakonda: ఎవరిని కించపరచాలని మాట్లాడలేదు… వివరణ ఇచ్చిన విజయ్ దేవరకొండ!