Indian Railways: రైల్లో నీళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగిన ఘటన కర్నాటకలో జరిగింది. నీళ్లు నింపే వరకు రైలును కదలనిచ్చేదే లేదని భీష్మించుకు కూర్చుకున్నారు. ప్యాసింజర్ల గొడవతో మైసూర్-దాదర్ షరావతి ఎక్స్ ప్రెస్ ను మిరాజ్ రైల్వే జంక్షన్ లో రెండు గంటలకు పైగా నిలిపివేశారు. శనివారం రాత్రి 8.50 గంటలకు మిరాజ్ స్టేషన్ కు చేరుకుంది. రైలు టాయిలెట్లలో నీరు లేకపోవడంపై ప్రయాణీకులు ఆందోళన చేపట్టారు. హుబ్బళ్లి జంక్షన్ లోనే ఫిర్యాదు చేసినప్పటికీ, పట్టించుకోలేదు. ఖాళీ వాటర్ ట్యాంకులతోనే రైలు మిరాజ్ కు చేరుకుంది. ఎంత చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణీకులు దిగి ఆందోళనకు దిగారు. రైల్లో నీళ్లు నింపే వరకు రైలు కదలనిచ్చేదే లేదన్నారు.
పైప్ లైన్ లో సమస్య కారణంగా..
రైల్లో నీళ్లు రాకపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని మిరాజ్ రైల్వే స్టేషన్ మేనేజర్ జె ఆర్ టాండలే వెల్లడించారు. తన జంక్షన్ లో నీళ్లు నింపకపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుందన్నారు. మెయిన్ పైప్ లైన లో సమస్య కారణంగానే నీళ్లు నింపలేకపోయినట్లు తెలిపారు. దానిని పరిష్కరించేందుకు సమయం పట్టిందన్నారు. దానిని సరిదిద్దిన తర్వాత రైల్లో నీళ్లు నింపినట్లు తెలిపారు. ఈ రైలు మినహా మిగతా ఏ రైల్లో ఇబ్బంది తలెత్తలేదన్నారు. షరావతి ఎక్స్ ప్రెస్ రైలు సుమారు 2 గంటల పాటు నిలిపివేశారని వెల్లడించారు. వాటర్ ట్యాంకులను నింపేందుకు బోగీకి సుమారు నిమిషంన్నర సమయం పట్టినట్లు తెలిపింది. మొత్తం రైలుకు వారట నింపేందుకు సుమారు 10 నిమిషాల సమయం పట్టినట్లు వెల్లడించారు. నీటిని నింపిన తర్వాత షరావతి ఎక్స్‌ప్రెస్ రాత్రి 11 గంటలకు మిరాజ్ జంక్షన్ నుంచి బయలుదేరి ఉదయం 7 గంటలకు దాదర్ చేరుకుంది. షెడ్యూల్ కు సుమారు రెండు గంటలు ఆలస్యంగా వెళ్లినట్లు తెలిపారు. మిరాజ్ జంక్షన్ స్టేషన్ లో నీటి సరఫరా కోసం ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేశారు. నేరుగా కృష్ణానది నుంచి నీటిని సరఫరా చేస్తుంది.
Read Also: గుజరాత్ సీఎం ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చేసిన పాకిస్తాన్.. ఇది 1965 ఘటన!
మూడు స్టేషన్లలో వాటర్ రీఫిల్
షరావతి ఎక్స్‌ప్రెస్ సాధారణంగా హుబ్లీ, మిరాజ్, పూణే స్టేషన్లలో నీటి రీఫిల్ చేస్తారు. కానీ, తాజాగా పైప్ లైన్ లో సమస్య కారణంగా వాటర్ ట్యాంకులను నింపలేకపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే అధికారులు కచ్చితంగా వాటర్ రీఫిల్ చేపట్టాలని ప్రయాణీకులు కోరారు. నీటి సరఫరా లేకపోతే ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడాల్సి ఉంటుందన్నారు. ఇకపై రైళ్లకు నీరు పెట్టే వ్యవస్థను మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రయాణీకుల ఆందోళనతో మిరాజ్ రైల్వే స్టేషన్ లో కాసేపు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. రైల్లో నీళ్లు నింపడంతో శాంతించారు.
Read Also: ట్రైన్ టాయిలెట్ నుంచి మంటలు.. వాడు చేసిన పనికి ప్రయాణీకులు పరుగులు!