E-Paper
Advertisement

సండే స్పెషల్ గోంగూర మటన్ ఇగురు.. ఈ కొలతలతో చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది!

సండే స్పెషల్ గోంగూర మటన్ ఇగురు.. ఈ కొలతలతో చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది!
Advertisement

Gongura Mutton Iguru: ఆదివారం వచ్చిందంటే చాలు.. ఇంట్లో చికెన్ లేదా మటన్ వంటకం ఉండాల్సిందే. అందులోనూ వేడి వేడి అన్నంలో నోరూరించే గోంగూర మటన్ ఇగురు కలుపుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే.. ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే. పుల్లపుల్లని గోంగూర, మెత్తగా ఉడికిన మటన్ ముక్కలు, ఘాటైన మసాలాల కలయికతో ప్రతి ముద్దా అద్భుతమే. ముఖ్యంగా మట్టి పాత్రలో వండితే వచ్చే ఆ పల్లెటూరి సువాసన, అమ్మమ్మ చేతి వంటను గుర్తు చేస్తూ తినాలనే కోరికను మరింత పెంచేస్తుంది. మన తెలుగు వంటకాలకే ప్రత్యేకమైన ఈ గోంగూర మటన్ ఇగురు రుచి చూస్తే.. ఇంకో ముద్ద ఎక్కువే తింటారు. ఇప్పుడీ రెసిపీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

మటన్ – అర కేజీ
గోంగూర ఆకులు – రెండు కట్టలు
ఉల్లిపాయలు – మూడు
పచ్చిమిర్చి – ఆరు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు స్పూన్లు
కారం – మూడు స్పూన్లు
పసుపు – అర స్పూన్
ధనియాల పొడి – రెండు స్పూన్లు
గరం మసాలా – ఒక స్పూన్
నూనె – సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా
లవంగాలు – నాలుగు
చెక్క – రెండు చిన్న ముక్కలు
యాలకులు – రెండు
కొత్తిమీర – కొద్దిగా

Advertisement

Also Read: అమ్మమ్మ కాలం నాటి అరుదైన వంటకం.. వెదురు చిగుళ్ల కూర తింటే ఇన్ని లాభాలా?

తయారీ విధానం ఇలా:

మీకు కావాల్సినంత మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గోంగూర ఆకులను తీసుకుని పుల్లలు లేకుండా శుభ్రంగా వలుచుకొని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో కొద్దిగా నూనె వేడి చేసి లవంగాలు, చెక్క, యాలకులు వేసి వేయించాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలపాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్‌ను అందులో వేసి, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. మటన్‌లో ఉన్న నీరంతా ఇంకిపోయే వరకు మూత పెట్టి ఉడికించాలి.

Advertisement

మటన్ కాస్త ఉడికిన తర్వాత అందులో కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఒక గ్లాసు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ ఉడికేలోపు వేరొక పాన్ తీసుకుని కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి ఉడికించాలి. గోంగూర మెత్తగా ఉడికిన తర్వాత గరిటెతో మెదిపి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే మటన్ చక్కగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న గోంగూర గుజ్జును ఆ మటన్ మిశ్రమంలో కలపాలి.

అన్ని పదార్థాలు బాగా కలిసిపోయేలా గరిటెతో తిప్పుతూ చిన్న మంట మీద మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా గరం మసాలా పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. నోరూరించే గోంగూర మటన్ ఇగురు సిద్ధమైనట్టే. దీన్ని వేడి వేడి అన్నంలోకి లేదా రాగి సంగటితో తింటే రుచి జీవితంలో మర్చిపోలేరు.

Also Read: పీతలను ఇలా మసాలా పెట్టి వండితే.. ఆ వాసనకే కడుపు నిండిపోతుంది!

Tags

Related News

ఆదివారం లంచ్‌కి ఇది పర్ఫెక్ట్ స్టార్టర్.. ఇలా చేస్తే అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే!

కొబ్బరి నూనె, మసాలాలతో కేరళ స్టైల్ పీతల వేపుడు.. తయారీ విధానం ఇదిగో!

హైదరాబాద్‌లో 44వ అంతస్తులో వేలాడుతూ.. ఇతడి జీతం ఎంతో తెలుసా?

హెల్తీ అండ్ టేస్టీ సోయా చంక్స్ పులావ్..క్షణాల్లోనే రెడీ అవుతుంది

కేరళ స్టైల్ ప్రాన్స్ ఫ్రై..హోటల్ టేస్ట్ మించిపోయేలా ఇంట్లోనే ఇలా రెడీ చేయండి!

హోటల్ స్టైల్ కరివేపాకు చికెన్ ఫ్రై..టేస్ట్ అదిరిపోద్ది!

దీపావళికి ముందే ఈ 5 పనులు చేసేయండి.. పండగ రోజు అస్సలు టెన్షన్ ఉండదు!

Big Stories

Advertisement
×