E-Paper
Advertisement

పక్కా తెలంగాణ స్టైల్ సర్వపిండి..ఒక్క సారి టేస్ట్ చేేస్తే అస్సలు వదలరు!

పక్కా తెలంగాణ స్టైల్ సర్వపిండి..ఒక్క సారి టేస్ట్ చేేస్తే అస్సలు వదలరు!
Advertisement

Telangana sarva pindi recipe: తెలంగాణ వంటకాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అద్భుతమైన వంటకం ‘సర్వపిండి’. దీనిని కొన్ని ప్రాంతాల్లో ‘గిన్నె పిండి’ లేదా ‘పెనం పిండి’ అని కూడా అంటారు. బయట కరకరలాడుతూ,లోపల మెత్తగా.. ఉండే ఈ ట్రెండీ స్నాక్ రుచి చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. హోటళ్లలో దొరికే వాటికంటే అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో, పక్కా తెలంగాణ స్టైల్‌లో ఇంట్లోనే ఈ సర్వపిండిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం!

కావలసిన పదార్థాలు:

బియ్యం పిండి : 2 కప్పులు (సుమారు 400 గ్రాములు)

Advertisement

శనగపప్పు : 2 టేబుల్ స్పూన్లు (నానబెట్టినవి)

పల్లీలు : 3 టేబుల్ స్పూన్లు

Advertisement

నూనె : 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు

ఉల్లిపాయలు : 1 పెద్దది (సన్నగా తరిగినవి)

పచ్చిమిర్చి, కారం: రుచికి సరిపడా

జీలకర్ర,నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్: కొద్దిగా

కరివేపాకు, కొత్తిమీర: గుప్పెడు

తయారీ విధానం :

1: మొదటగా ఒక పెద్ద గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, వేయించి పొట్టు తీసిన పల్లీలు, నువ్వులు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేయాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి చేతితో అన్ని పదార్థాలు పిండిలో బాగా.. కలిసేలా మిక్స్ చేయాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా గోరు వెచ్చని నీళ్లు పోస్తూ.. చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి.

2:అసలైన సర్వ పిండి రహస్యం ఇక్కడే ఉంది. ఒక మందపాటి గిన్నె (అల్యూమినియం లేదా నాన్‌స్టిక్ గిన్నె) లేదా సర్వ పిండి గిన్నె తీసుకుని దానికి చుట్టూ నూనె రాయాలి.ఇప్పుడు కలుపుకున్న పిండిలో నుండి ఒక పెద్ద ఉండను తీసుకుని, ఆ గిన్నె మధ్యలో పెట్టి చేతి వేళ్లతో సమానంగా వృత్తాకారంలో ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా సమానంగా ఉండటం ముఖ్యం అన్ని వైపులా.

3: పిండిని గిన్నె అంతా ఒత్తుకున్న తర్వాత, మీ వేలితో ఆ పిండిలో అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. ఈ రంధ్రాల ద్వారా మనం వేసే నూనె లోపలికి వెళ్లి పిండి చక్కగా ఉడికేలా, కరకరలాడేలా చేస్తుంది. ఆ తర్వాత ఆ రంధ్రాలలో , సర్వపిండి చుట్టూ కొద్దిగా నూనెను వేయాలి.

4: ఇప్పుడు గిన్నెను స్టవ్ మీద పెట్టి మంటను మీడియం నుంచి లో ఫ్లేమ్‌లో ఉంచాలి. గిన్నెపై మూతపెట్టి సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యలో గిన్నెను కొద్దిగా తిప్పుతూ ఉంటే అన్ని వైపులా సమానంగా కాలుతుంది. అడుగు భాగం బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు కాల్చాలి. అంతే.. అడుగు భాగం క్రిస్పీగా, పైభాగం గుమ గుమలాడే పక్కా తెలంగాణ స్టైల్ సర్వపిండి సిద్ధం!

వేడివేడిగా సర్వపిండి తింటే ఆ రుచే వేరు. సాయంత్రం పూట ఈ ట్రెండీ స్నాక్‌ను మీ ఇంట్లో ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్లు మళ్లీ మళ్లీ అడిగి మరీ చేయించుకుంటారు.అంత రుచిగా ఉంటుంది ఈ స్నాక్.

Related News

పర్ఫెక్ట్ కొలతలతో గుమగుమలాడే సెమియా కేసరి..క్షణాల్లోనే రెడీ అవుతుంది

పర్ఫెక్ట్ కొలతలతో..నోరూరించే బ్రెడ్ హల్వా రెసిపీ

పప్పుచారులో నంజుకోవడానికి బాప్‌లాంటి ‘కరివేపాకు రొయ్యల వేపుడు’.. తింటే ఫిదా అయిపోతారు!

రాయలసీమ స్టైల్ నాటుకోడి వెల్లుల్లి కారం.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా!

బోటీ కూర అంటే ఇష్టముండదా? చింతచిగురుతో ఇలా చేస్తే ప్లేట్లు నాకేస్తారు!

రైస్ వాటర్‌తో మెరిసే జుట్టు, గ్లాస్ స్కిన్ సాధ్యమేనా? సోషల్ మీడియాలో చెప్పేదంతా నిజమేనా?

మధ్యాహ్నం కాగానే కళ్లు మూతలు పడుతున్నాయా? శరీరం ఇచ్చే డేంజర్ సిగ్నల్ ఇది!

Big Stories

Advertisement
×