BigTV English

Snake Bite: నిజమా? బోడ కాకరకాయ పాము విషానికి ఔషధమా?

Snake Bite: నిజమా? బోడ కాకరకాయ పాము విషానికి ఔషధమా?

Snake Bite:  పాము కాటు అని వినగానే చాలా మందికి భయమే. మన గ్రామీణ ప్రాంతాల్లో పూర్వం నుంచీ పాము కాటుకి ఉపయోగపడే ఒక అద్భుతమైన కూరగాయ ఉందంటే నమ్ముతారా.  మీరు విన్నది నిజమే! అంత చిన్న కూరగాయ పాము కాటుకి ఉపయోగిస్తారా అని అనుకుంటున్నారా? అవును చిన్న కూరగాయ అయినా, ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడుతుంది. దానిపేరే బోడ కాకరకాయ. దీని శాస్త్రీయ పేరు ట్రైకోసాంథెస్ కుకుమెరినా. ఇది పొడవుగా ఉండే కాకరకాయ లాంటి దుంప, కానీ రుచి మాత్రం చాలా చేదుగా ఉంటుంది.


గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని పాము కాటు బోడ కాకరకాయ అని పిలుస్తారు. కారణం ఏమిటంటే, పాము కాటుకి ప్రథమ చికిత్సగా దీనిని ఉపయోగించేవారు. నిజంగా పాము కాటుకి ఇది మందు అవుతుందా అన్నది ఇంకా శాస్త్రీయంగా పూర్తి నిరూపించబడలేదు. కానీ మన పెద్దవాళ్లు దీని చేదు రసాన్ని పాము కాటు గాయం దగ్గర రాసేవారు. అంతేకాక తినడానికి కూడా ఇస్తారు.

ఇందులో కాఢి, చేదు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ చేదు రసం వల్ల శరీరంలో ఉన్న విషపదార్థాలు బయటపడతాయని నమ్మకం. అందుకే కేవలం పాముకాటు మాత్రమే కాదు, విషజ్వరాలు, చర్మవ్యాధులు, జీర్ణ సమస్యలకు కూడా దీనిని వాడేవారు.


Also Read: Health Benefits: రోజూ సగ్గుబియ్యం జావ.. తింటే ఏమవుతుందో తెలుసా?

కాకరకాయల్లో సాధారణంగా విటమిన్-సి, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. బోడ కాకరకాయలో ఇవన్నీ మరింత ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి మంచి రక్షణ ఇస్తుందని పెద్దలు చెబుతారు. పాము కాటుతో బాధపడినప్పుడు ఇది మాత్రమే కాదు, తోడు ఇతర మూలికలతో కలిపి కూడా వాడేవారు.

ఉదాహరణకి, బోడ కాకరకాయ గుజ్జుతో పాటు వెల్లుల్లి, వేపపత్రి కలిపి గాయంపై రాసేవారు. కొన్ని చోట్ల అయితే దీన్ని పచ్చిగా ముద్ద చేసి తినిపించేవారు కూడా. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. పాము కాటు అంటే ప్రాణాంతకమయిన విషయం. కేవలం బోడ కాకరకాయపై ఆధారపడకూడదు. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి యాంటీ వెనం ఇంజెక్షన్ వేయించుకోవాలి. గ్రామీణ నమ్మకాల్ని పూర్తిగా నిరాకరించలేము కానీ శాస్త్రీయ వైద్యం తప్పనిసరి.

ప్రస్తుతం ఆధునిక వైద్యం ఉన్నా, ఈ మొక్క ప్రాధాన్యత తగ్గిపోలేదు. ఎందుకంటే దీని చేదు రసం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తం శుద్ధి కావడానికి, మధుమేహం నియంత్రణకు, జీర్ణక్రియ బాగు కావడానికి ఇంకా చాలా మంది దీనిని ఆహారంలో వాడుతున్నారు. ఈ బోడ కాకరకాయ పొడవు కొన్ని సార్లు 5 నుంచి 6 అడుగుల వరకు పెరుగుతుంది. అందుకే దీన్ని స్నేక్ గోర్డ్ అని కూడా పిలుస్తారు. పేరు వింటేనే పాములా పొడుగ్గా ఉందని అర్థమవుతుంది.

Tags

Related News

Health tips: ఉడికించిన శనగల్లో ఇవి కలిపి తింటే.. పోషకాలు డబుల్

Kiwi Fruit In Breakfast: బ్రెక్ ఫాస్ట్‌లో రోజుకో కివీ ఫ్రూట్ తింటే.. ఈ సమస్యలన్నీ పరార్ !

Health Benefits: రోజూ సగ్గుబియ్యం జావ.. తింటే ఏమవుతుందో తెలుసా?

Seeds For Weight Loss: త్వరగా బరువు తగ్గాలంటే.. ఏ సీడ్స్ తినాలో తెలుసా ?

Boiled Eggs Vs Paneer: ఎగ్స్ Vs పన్నీర్.. ఉదయం పూట ఏది తింటే బెటర్ ?

Big Stories

×