BigTV English

Samantha:శుక్రవారం అంటే వణికిపోయేదాన్ని… ఆనాటి రోజులపై సమంత సంచలన కామెంట్!

Samantha:శుక్రవారం అంటే వణికిపోయేదాన్ని… ఆనాటి రోజులపై సమంత సంచలన కామెంట్!

Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ‘ఏ మాయ చేసావే’ అనే సినిమా ద్వారా అడుగుపెట్టి.. తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు హీరోయిన్ గానే కాకుండా మరొకవైపు నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యింది సమంత (Samantha). ఇదిలా ఉండగా తాజాగా నాటి రోజులను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది. సక్సెస్ కోసం పరిగెత్తిన రోజులు.. బాక్సాఫీస్ నంబర్ల కోసం టెన్షన్ పడిన రాత్రులు.. అన్ని ఒక్క క్షణంలో తలకిందులు అయ్యాయి అని తెలిపింది. విజయం, డబ్బు, ఖ్యాతి అన్నీ ఉన్నా.. ఆరోగ్యం లేకపోతే జీవితం అసంపూర్ణం అని ఆమె చెప్పుకొచ్చింది.


సక్సెస్ అంటే అదే అనుకున్నాను..

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమంత.మీ మాయోసైటిస్ తో పోరాడినప్పుడు తన జీవితం, ఆలోచనలు, ప్రాధాన్యతలు అన్నీ మారిపోయాయని.. గతంలో విజయాలు ఇవే అనుకున్నప్పటికీ ఇప్పుడు జీవితాన్ని చూసే దృక్పథం కూడా మారిపోయిందని చెప్పుకొచ్చింది. ఇదే విషయంపై సమంత మాట్లాడుతూ.. “ఒకప్పుడు విజయం అంటే వరుస సినిమాలు చేయడమే అనుకున్నాను ఒకే ఏడాదిలో ఐదు సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే నిజమైన సక్సెస్ అని నమ్మేదాన్ని కూడా.. పైగా పెద్ద పెద్ద హీరోలతో నటించాలి..బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలి.. టాప్ టెన్ హీరోయిన్ జాబితాలో ఉండాలి ఇవే నా కలలు.

ప్రతి శుక్రవారం భయపడేదాన్ని..


కానీ మయోసైటిస్ తర్వాత నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. నా దగ్గర రూ.1000 కోట్ల సినిమాలు కూడా లేవు. రెండేళ్లుగా నా సినిమాలు కూడా రిలీజ్ కాలేదు. పైగా టాప్ టెన్ లిస్టులో కూడా నేను లేను. అయినా ఉన్నంతలోనే సంతోషంగా ఉన్నాను.. నాలో ఈ మార్పు రావడానికి కారణం.. ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ నంబర్లు చూసి టెన్షన్ పడేదాన్ని.. నా స్థానాన్ని ఎవరైనా భర్తీ చేస్తారేమో అనే భయం కూడా ఉండేది. కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. నా అభిమానుల్లో చాలామంది, నన్ను సినిమాల వల్ల గ్లామర్ వల్ల ఫాలో అవుతున్నారని నాకు తెలుసు. అందరికీ వారికోసం ఇప్పుడు హెల్త్ కి సంబంధించిన విషయాలను చెబుతున్నాను. ఆరోగ్యం పై అవసరమైన సమాచారాన్ని అందివ్వాలని ప్రయత్నం చేస్తున్నాను* అంటూ చెప్పుకొచ్చింది సమంత.

ఆరోగ్యమే ప్రధానం..

మొత్తానికి అయితే సమంతలో వచ్చిన ఈ మార్పు చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గజిబిజి ఉరుకుల లైఫ్ స్టైల్ లో జీవితం లో ముందడుగు వేయడం అంటే డబ్బు సంపాదించడం కాదు అని ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం అని తెలిపింది సమంత.

సమంత సినిమాలు..

సమంత సినిమాల విషయానికి వస్తే.. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రక్త బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్డమ్ లో నటిస్తోంది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే తెలుగులో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రంలో నటిస్తూ ఉండగా.. దీనికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

 

ALSO READ:NTR – Neel: ఎన్టీఆర్ కోసం రిషబ్ రంగంలోకి.. ఏ పాత్రో తెలిస్తే నమ్మలేరు!

Related News

Trance Of Omi : ఓజీ vs ఓమి… ఏంట్రా విలన్ కి కూడా ఇంత హైప్ ఇస్తారా?

Raghava Lawrence: నా హృదయాన్ని కదిలించారు.. ప్లీజ్‌ వారి వివరాలు తెలిస్తే నాకు చెప్పండి.. రూ. లక్ష సాయానికి సిద్ధం..

Actor Wife : ప్రాణం తీసిన ఐస్ క్రీమ్, దిగ్బ్రాంతి లో ఆ నటుడి కుటుంబం

Manchu Manoj: మనోజ్ ది డామినేటర్… అందుకే మిరాయ్ టీం పక్కన పెట్టిందా ?

NTR – Neel: ఎన్టీఆర్ కోసం రిషబ్ రంగంలోకి.. ఏ పాత్రో తెలిస్తే నమ్మలేరు!

Big Stories

×