Health Benefits: మన ఇంట్లో ఉపవాసం సమయంలో ఎక్కువగా వాడే పదార్థం ఏదైనా ఉందంటే అది సగ్గుబియ్యం. చిన్న చిన్న ముత్యాల్లా కనిపించే ఈ ఆహారం నిజానికి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలామంది దీన్ని ఉపవాసంలో మాత్రమే తింటారు కానీ, నిజానికి దీన్ని తరచుగా తింటే మన ఆరోగ్యానికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
సగ్గుబియ్యంతో చేసిన జావ, పాయసం లేదా వడలు ఏ విధంగానైనా ఇది తేలికగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారికి ఇది మంచి ఆహారం.
రోజూ ఒక కప్పు సగ్గుబియ్యం జావ తీసుకుంటే శరీరానికి చల్లదనం లభిస్తుంది. వేసవికాలంలో ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. అలసట, నీరసం, వేడి వలన వచ్చే ఇబ్బందులను సగ్గుబియ్యం తక్షణమే తగ్గిస్తుంది.
అలాగే, ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అందుకే ఉపవాసంలో దీన్ని ఎక్కువగా వాడుతారు. పొట్ట నిండిన భావన ఇచ్చి, తక్కువ ఆహారంతో కూడా ఎక్కువ సమయం ఆకలి రాకుండా చేస్తుంది. సగ్గుబియ్యం తింటే గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. రక్తప్రసరణ సరిగా ఉండేలా చేయడమే కాకుండా, రక్తపోటు నియంత్రణలో కూడా సహాయపడుతుంది.
ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది జీర్ణవ్యవస్థకు చాలా హెల్ప్ చేస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు లేదా అజీర్ణం బాధపడుతున్నవారు సగ్గుబియ్యం జావ తింటే కడుపు సమస్యలు తగ్గుతాయి. గర్భిణీ స్త్రీలకు కూడా ఇది మేలే. శరీరంలో వేడి తగ్గించి, తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అలాగే పిల్లల ఎదుగుదలకు కావాల్సిన శక్తిని అందిస్తుంది.
వైద్యులు కూడా చెబుతున్నట్లు, సగ్గుబియ్యం తరచుగా తింటే బరువు తగ్గడంలో కూడా సహాయం చేస్తుంది. ఎందుకంటే ఇది తక్కువ కొవ్వు (low fat) కలిగి ఉంటుంది. పైగా పొట్ట నిండిన భావన ఇచ్చి, ఎక్కువ తినకుండా నియంత్రిస్తుంది.
అలాగే, బలహీనంగా ఉన్నవారు సగ్గుబియ్యం జావతోపాటు పాలు, గింజలు కలిపి తింటే బరువు పెరుగుతారు. అంటే బరువు తగ్గాలనుకునే వాళ్లకు కూడా, బరువు పెరగాలనుకునే వాళ్లకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సగ్గుబియ్యం శరీరంలో నీరసం, అలసట, డీహైడ్రేషన్ లాంటి సమస్యలను తగ్గిస్తుంది. వేసవిలో ఎక్కువగా తీసుకుంటే హీట్‌స్ట్రోక్ నుంచి రక్షిస్తుంది.
బరువుపెరిగే అవకాశం
కానీ, ఒక జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా పాటించాలి. సగ్గుబియ్యం ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. సగ్గుబియ్యం అనేది సాధారణంగా కనిపించే పదార్థం అయినా, దాని లాభాలు మాత్రం అసాధారణం. అందుకే ఇంట్లో తరచుగా సగ్గుబియ్యం జావ, పాయసం, వడలు వంటివి చేసుకుని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.