BigTV English

Rice with Insects: పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది..?

Rice with Insects: పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది..?
Best Tips to Get Rid of Insects in Rice
Best Tips to Get Rid of Insects in Rice

Best Tips to Get Rid of Insects in Rice:  బియ్యం మన నిత్యావసర వస్తువుల్లో ఎంతో ముఖ్యమైనవి. మనం అందరం కష్టపడేది అన్నం కోసమే. అన్నం లేకుంటే మ‌న‌కు రోజు గ‌డ‌వ‌దు. అందుకే బియ్యాన్ని రెండు, మూడు నెలలకు సరిపడేలా ముందే నిల్వచేసి పెట్టుకుంటాం. ఇలా మందు జాగ్రత్తగా బియ్యం నిల్వ చేసుకోవడం మంచిదే.కానీ కొన్ని సందర్భాల్లో నిల్వ చేసిన బియ్యంపై పురుగులు పడుతుంటాయి. ఈ పురుగులు విస‌ర్జంచే వ్య‌ర్థాలు బియ్యంపై అలానే ఉండిపోతాయి. ఇలా పురుగులు పట్టిన బియ్యం తినడం వల్ల అనేక జీర్ణ సంబంధిత సమస్యలు చుట్టుముడుతాయి. అసలు బియ్యంలో పురుగులు పడకుండా ఏం చేయాలి? పురుగులు పడిన బియ్యం తింటే ఏమౌతుందో తెలుసుకుందాం.


బియ్యానికి పురుగులు ఎందుకు పడతాయి..?

సాధారణంగా నిల్వ చేసిన బియ్యానికి, ధాన్యాలను నుసి పురుగులు, ముక్కు పురుగులు, లద్ది పురుగులు పడతాయి. ఈ పురుగులు ధాన్యం గింజలను పాడు చేస్తాయి. ధాన్యానికి రంధ్రం చేసి వాటిని పొడిగా మారుస్తాయి. ఇలా పొడిగా అయిన బియ్యాన్ని శుభ్రం చేయడం కాస్త కష్టమే అని చెప్పాలి. అంతేకాకుండా ఈ బియ్యాన్ని తినడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.


వరి, గోధుమలకు పీచు పదార్థం ఉన్న కవచం తక్కువగా ఉంటుంది. దీని వలనే వీటిని నిల్వ చేయడం వల్ల పురుగులు పడతాయి. బియ్యం, గోధుమలకు ఉండే పీచు కవచం చాలా పలుచగా ఉంటుంది. కాట్టి వీటికి పురుగులు సులభంగా పడతాయి.

Also Read: రంజాన్ ఉపవాసం.. ఈ ఫుడ్స్‌తో ఎనర్జిటిక్‌గా ఉండండి!

పురుగులు పట్టిన బియ్యం తినొచ్చా..?

బియ్యానికి పురుగులు పట్టడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బియ్యాన్ని నీటిలో నానబెట్టి, శుభ్రంగా కడిగి, ఉడకబెట్టి తింటారు కాబట్టి. ఇలా చేయడం వల్ల వాటిలోని కీటకాలు, బ్యాక్టీరియా, మలినాలు చనిపోతాయి. అందువల్ల ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం ఉండకపోవచ్చు. అలానే బియ్యంలో పురుగుల పడిన కారణంగా జబ్బు పడిన కేసులు దేశంలో చాలా తక్కువనే చెప్పాలి.

పాతకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ ఉండేది. కాబట్టి వారు ఎక్కువ మొత్తంలో బియ్యాన్ని నిల్వ చేసుకునే వారు. కానీ ప్రస్తుత కాలంలో ఉమ్మడి కటుంబాల వ్యవస్థలు అనేవి లేవు. అన్ని చిన్న కుటుంబాలుగా మారాయి. ఎక్కువ మొత్తంలో బియ్యం నిల్వ చేసుకునే అవకాశం లేదు. బియ్యానికి పురుగులు పట్టకుండా బోరిక్ పౌడర్, ఆముదం నూనె వంటి వాటిని కూడా బియ్యం డబ్బాల్లో ఉంచొచ్చు.

కీటకాల నుండి బియ్యం రక్షించడానికి మార్గాలు

  • బియ్యం నిల్వ చేసే డబ్బాల్లో బే ఆకులను ఉంచండి.
  • బియ్యాన్ని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి.

Also Read: కరివేపాకు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే ఉంటది గురూ!

  • బియ్యం నిల్వ చేసిన డబ్బాల్లో కొన్ని లవంగాలను వేయండి.
  • వెల్లుల్లి పొట్టు తీసి బియ్యంలో వేయడం వల్ల బియ్యానికి పురుగు ప‌ట్ట‌వు.
  • క‌ర్ఫూరాన్ని కూడా పరుగులు రాకుండా ఉపయోగించవచ్చు.
  • బియ్యంలో పురుగులు చేరకుండా అద్భుంగా పని చేస్తుంది వేపాకు.

Disclaimer: ఈ కథనాన్ని పలు అధ్యయనాల ఆధారంగా, నిపుణుల సలహా మేరకు రూపొందించాం. దీనిని కేవలం అవగాహనగ మాత్రమే చూడండి.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×