Bellamkonda Srinivas: అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సాధించుకుంది. ఈ సినిమాకి కథను బాబి అందించాడు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాసును హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా తర్వాత చేసిన స్పీడున్నోడు సినిమా పర్లేదు అనిపించుకుంది ఆ తర్వాత చేసిన జయ జానకి నాయక సినిమా మంచి హిట్ అనిపించింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు.
థియేటర్లో కంటే యూట్యూబ్ లోనే ఎక్కువ
కవచం, సీత, రాక్షసుడు, సాక్ష్యం వంటి సినిమాలు అంతంత మాత్రాన్ని ఫలితాన్ని తీసుకొచ్చాయి. శ్రీనివాస్ చేసిన సినిమాలు థియేటర్లో కంటే యూట్యూబ్ లోనే ఎక్కువ ఆదరణను సాధించాయి. నార్త్ లో అయితే యూట్యూబ్లో ప్రతి సినిమా కూడా కొన్ని మిలియన్ న్యూస్ దాటింది. ఈ సందర్భంగా నార్త్ లో కూడా ఫలితాన్ని సాధించాలని ఉద్దేశంతో సూపర్ హిట్ అయిన ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో నిర్మించారు. ఈ సినిమా అక్కడ ఊహించిన ఫలితాన్ని అందించలేదు. ఛత్రపతి సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ ని ఒక కొత్త స్టార్ గా ఎదిగేలా చేసింది. ఈ సినిమా తర్వాతే ప్రభాస్ లెవెల్ కూడా మారిపోయిందని కొంతమంది చెబుతూ ఉంటారు.
Also Read : Akhil Akkineni’s Upcoming Film : అయ్యగారు అదిరిపోయే అవకాశం అందుకున్నారు
టైసన్ నాయుడు అప్డేట్
ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ టైసన్ నాయుడు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నేపాల్ లో జరుగుతుంది. ఐదు రోజుల పాటు శ్రీనివాస్, ప్రజ్ఞా జైస్వాల్ మధ్య జరిగే సీన్స్ తీయనున్నారు. ఇంకో షెడ్యూల్ తో టోటల్ షూట్ కంప్లీట్ కానుందని సమాచారం. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా తర్వాత సాగర్ కే చంద్ర దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. భీమ్లా నాయక్ వాస్తవానికి రీమేక్ సినిమా అయినా కూడా సాగర్ డీల్ చేసిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. అలానే ఆ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్ మంచి ప్లస్ పాయింట్ గా మారాయి. ఇక దర్శకుడుగా అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు, సినిమాలో కూడా సాగర్ కి మంచి పేరుని తీసుకొచ్చాయి. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో విడుదల చేయనున్నారు.
Also Read : BIG TV Kissik Talk Show : తారక్ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు… రాజీవ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేశాడు