Sugar Cane Juice: వేసవిలో ఎక్కడ చూసినా చెరుకు రసం తయారు చేసి అమ్మే దుకాణాలే కనిపిస్తాయి. మండే ఎండల్లో చెరకు రసం తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. చెరకు రసంలో అనేక పోషకాలు ఉంటాయి. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటివి ఉంటాయి. అందుకే చెరకు రసం తరచుగా తాగడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డీహైడ్రేషన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు చెరకు రసం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చెరకు రసం తాగడం వల్ శరీరానికి తగినంత ఎలక్రోలైట్లు లభిస్తాయి. దీనిలో గ్లోకోజ్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
శక్తిని పెంచుతుంది:
చెరకు రసంలో సుక్రోజ్ ఉంటుంది. ఎండ కారణంగా సమ్మర్ లో ఎక్కువగా చెమట పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో చెరకు రసం తాగడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. డీహైడ్రేషన్ నుండి శరీరాన్ని రక్షించడంలో కూడా చెరకు రసం ఉపయోగపడుతుంది.
జీర్ణ క్రియ మెరుగుదల:
చెరకు రసం జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఇది సహజంగానే పొటాషియం, ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. మలబద్ధకంతో ఇబ్బంది పడే వారు చెరకు రసం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మూత్రపిండాల్లో రాళ్లు:
మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి సమస్య నుండి బయటపడటానికి చెరకు రసం సహాయపడుతుంది . దీనితో పాటు మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్న రోగులకు చెరకు రసం తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. చెరకులో ఉండే పోషకాలు మూత్ర నాళంలో వచ్చే వ్యాధులను నయం చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి.
కాలేయ ఆరోగ్యం కోసం:
మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉండటానికి చెరకు రసం తాగడం అలవాటు చేసుకోండి. ఒక గ్లాసు చెరకు రసంలో కాస్త నిమ్మరసం కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోండి. చెరకు రసం శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది కాలేయ సంబంధిత సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది.
Also Read: గుమ్మడి విత్తనాలతో.. మతిపోయే లాభాలు !
జ్వరం:
జ్వరం వచ్చినప్పుడు చెరకు రసం తాగాలి. శరీరంలో ప్రోటీన్ లేకపోవడం వల్ల జ్వరం వచ్చినప్పుడు ఒళ్లు నొప్పి, బలహీనత కలుగుతుంది. చెరకు రసం తాగడం వల్ల శరీరానికి మంచి మొత్తంలో ప్రోటీన్ లభిస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ముఖ్యమైన యాంటీ-ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉన్నాయి. జ్వరం ఉన్న సమయంలో ఐస్ కలిపిన చెరకు రసం తాగకూడదు.
దుర్వాసనను తొలగిస్తుంది:
నోటి నుండి వచ్చే చెడు వాసనను తగ్గించడంలో చెరకు రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. చెరకు రసంలో కాల్షియం , భాస్వరం ఉంటాయి. ఇవి దంత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా దుర్వాసనను నివారిస్తుంది. శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల కూడా నోటి నుండి దుర్వాసన వస్తుంది. అందుకే చెరకు రసం తాగండి.