BigTV English

Movies : బెన్‌ఫిట్ షోలపై టీఎస్ మరోసారి తీర్పు… మూవీ లవర్స్ ఇక సైలెంట్ అయిపోవడమే..?

Movies : బెన్‌ఫిట్ షోలపై టీఎస్ మరోసారి తీర్పు… మూవీ లవర్స్ ఇక సైలెంట్ అయిపోవడమే..?

 Movies.. 1970లో ఆంధ్రప్రదేశ్ సినిమా రూల్స్ ప్రకారం సినిమాటోగ్రఫీ ఎగ్జిబిషన్ లైసెన్స్ ఫారమ్ బిలోని లైసెన్స్ కండిషన్ 12(43) ఉదయం 8: 40 నిముషాలు అలాగే అర్ధరాత్రి 1:30 గంటల తర్వాత సినిమా ప్రదర్శనకు 16 ఏళ్ల లోపు పిల్లల్ని అనుమతించకూడదని న్యాయవాది చెప్పారు. ఎందుకంటే పదహారేళ్ల వయసులోపు ఉన్న పిల్లలు అర్ధరాత్రిలు 11:00 దాటిన తర్వాత సినిమాలు చూస్తే ఆ ఎఫెక్ట్ శారీరక, మానసిక హెల్త్ పై ప్రభావం చూపుతుంది అనే ఉద్దేశంతో కోర్టు అప్పట్లో ఈ తీర్పు ఇచ్చింది. కింది కోర్టులో ఈ విధమైన తీర్పు ఇవ్వగా దీన్ని హైకోర్టు కూడా అనుమతించింది.


అర్ధరాత్రి కూడా థియేటర్లలోకి పిల్లలకు అనుమతి..

దాంతో 16 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు రాత్రి 11:00 దాటిన తర్వాత సినిమాలు చూడడానికి అనుమతి ఇవ్వలేదు. కానీ తాజాగా దాన్ని కొట్టి వేసి హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటి నుండి 16 ఏళ్ల వయసులో వున్న పిల్లలు కూడా అర్ధరాత్రి 11:00 దాటిన తర్వాత సినిమా థియేటర్లలోకి అనుమతించాలని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సరిచేస్తూ.. తెలంగాణ హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. ఇకపై ఏ టైంలో అయినా పిల్లలను అన్ని షోలకు అనుమతించాలి అని చెప్పారు. కానీ బెనిఫిట్ షోలు,ప్రీమియర్ షోలు, స్పెషల్ షో లకి మాత్రం హైకోర్టు అనుమతిని ఇవ్వలేదు.


బెనిఫిట్ షోలకి నిరాకరణ..అసలేమైందంటే..

అసలు విషయంలోకి వెళ్తే.. ‘పుష్ప-2’ సినిమా సమయంలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు చావు బ్రతుకుల్లో ఉండడంతో 16 ఏళ్లలోపు పిల్లల్ని బెనిఫిట్ షోలకు, ప్రీమియర్ షోలకు అనుమతించకూడదు అని సీనియర్ జర్నలిస్టు కేసు వేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని 16 ఏళ్ల వయసులోపు ఉన్న పిల్లల్ని ప్రీమియర్ షోలకు, బెనిఫిట్ షోలకు రాత్రి 11:00 గంటల తర్వాత సినిమా థియేటర్లకి అనుమతించకూడదు అని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి రీసెంట్ గా తీర్పు ఇచ్చారు.అయితే జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ తెలంగాణ మల్టీప్లెక్స్ అసోసియేషన్ వాళ్లు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే ఈ కేసులో వాదోపవాదాలు ముగిసాక సింగిల్ జడ్జి ముందు మాకు మాట్లాడానికి అవకాశం ఇవ్వలేదని పిటిషనర్లు చెప్పారు. తుది నిర్ణయానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Dhee Show Contestant : మోసపోయాను అంటూ యువతి ఆత్మహత్యాయత్నం… ఆ ఢీ షో కంటెస్టెంట్ వల్లే అంటూ సెల్ఫీ వీడియో..!

మార్చి 17కి తదుపరి విచారణ..

అయితే ఈ ఉత్తర్వులు మల్టీప్లెక్స్ అసోసియేషన్ వారికి ఇబ్బందిగా మారడంతో మల్టీప్లెక్స్ అసోసియేషన్ వాళ్లు సింగిల్ జడ్జి ముందు అప్పీల్ చేసుకున్నారు. విజయ్ సేన్ రెడ్డి బెంచ్ ముందు తమకు న్యాయం జరగకపోతే బెంచ్ ని ఆశ్రయిస్తామని మల్టీప్లెక్స్ అసోసియేషన్ వాళ్లు తెలిపారు. అయితే తాజాగా 16 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల్ని కూడా రాత్రి 11:00 తర్వాత అన్ని షోలు చూడడానికి థియేటర్ కి అనుమతించాలని తీర్పు ఇచ్చారు. అలాగే స్పెషల్ షో, బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలకు సంబంధించిన విచారణను మార్చి 17 కి వాయిదా వేయడం జరిగింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×