BigTV English

Hair Growth Serum: ఈ హెయిర్ సీరం వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది

Hair Growth Serum: ఈ హెయిర్ సీరం వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది

Hair Growth Serum: జుట్టు సంరక్షణ కోసం మార్కెట్లో అనేక రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. జుట్టుకు హెయిర్ కండిషనర్, హెయిర్ మాస్క్ , హెయిర్ సీరం వంటివి ఉపయోగించడం కామన్. హెయిర్ సీరం అనేది జుట్టుకు చాలా సులభంగా అప్లై చేయవచ్చు. కానీ చాలా మందికి హెయిర్ సీరం విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి. అసలు హెయిర్ సీరం నిజంగా అవసరమా ? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


హెయిర్ సీరం వాడటం అవసరమా ?
హెయిర్ సీరం అనేది సిలికాన్ ఆధారిత లిక్విడ్ అని చెప్పొచ్చు. ఇది హెయిర్ ఆయిల్ మాదిరిగా జుట్టు కుదుళ్లలోకి చొచ్చుకుపోదు లేదా జుట్టు ఆకృతిని కూడా మార్చదు. హెయిర్ సీరం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

హెయిర్ సీరంలో సిలికాన్ ఉంటుంది. ఇది జుట్టును బలంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. సిలికాన్ ఆధారిత సీరమ్‌లు తక్కువ pH స్థాయిని కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఇవి జుట్టు చిట్లి పోవడాన్ని కూడా నివారించడంలో సహాయపడుతుంది. డైమెథికోన్ , పాలీసిలోక్సేన్ సీరమ్స్ వంటివి చాలా మంది వాడుతుంటారు. ఇవి జుట్టు మూలాలను రక్షించడానికి, అంతే కాకుండా వేడిని తొలగించడానికి క్యూటికల్ ఫైలర్‌లను ఒకదానితో ఒకటి బంధించడంలో సహాయపడతాయి.


హెయిర్ సీరం వల్ల కలిగే ప్రయోజనాలు :
1.హెయిర్ సీరం జుట్టును మెరిసేలా , ఆరోగ్యంగా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంతి. అంతే కాకుండా ఇది జుట్టు చిక్కుబడకుండా నిరోధించడానికి కూడా సహాయపడుతుంది.

2.సీరమ్‌లు జుట్టును మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా జుట్టుకు ఆరోగ్యకరమైన రూపాన్ని ఇస్తాయి. ఇది దుమ్ము , తేమ నుండి కూడా ఉపశమనం అందిస్తుంది.

3. సీరం యొక్క తక్కువ pH స్థాయి జుట్టు  రాలడాన్నితగ్గిస్తుంది.

4. హెయిర్ సీరం సూర్యకాంతి, కాలుష్య కారకాలు, ఇతర హానికరమైన రసాయనాలు, హీట్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ వల్ల కలిగే నష్టం నుండి జుట్టును రక్షిస్తుంది.

హోం మేడ్ హెయిర్ సీరం:

1. కలబంద, కొబ్బరి నూనెతో హెయిర్ సీరం:
కలబందలో విటమిన్లు , పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతే కాకుండా జట్టుకు అవసరం అయిన తేమను కూడా అందిస్తాయి. కొబ్బరి నూనె జుట్టును లోతుగా హైడ్రేట్ చేస్తుంది . అంతే కాకుండా జుట్టుకు కొత్త మెరుపును కూడా అందిస్తుంది.

కావాల్సినవి:
అలోవెరా జెల్ – 2 టేబుల్ స్పూన్ల
కొబ్బరి నూనె-1 టేబుల్ స్పూన్
లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ 2-3 చుక్కలు

ఎలా తయారు చేయాలి ?
ఒక గిన్నెలో అలోవెరా జెల్ , కొబ్బరి నూనె వేసి బాగా కలిసే వరకు మిక్స్ చేయండి. వీలైతే.. కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని తడి జుట్టుకు అప్లై చేయండి.

2. కాస్టర్ ఆయిల్, బాదం ఆయిల్ సీరం:
కావాల్సినవి:
కాస్టర్ ఆయిల్- 2 టేబుల్ స్పూన్లు
బాదం నూనె- 1 టేబుల్ స్పూన్

Also Read: సమ్మర్‌లో ట్యాన్ పోయి.. ముఖం తెల్లగా మెరిసిపోవాలంటే ?

ఎలా తయారు చేయాలి ?
ముందుగా ఒక గిన్నెలో పైన తెలిపిన ఆయిల్ లను తీసుకుని మిక్స్ చేయండి. తర్వాత దీనిని ఒక బాటిల్ లో డబ్బాలో నిల్వ చేయండి. అవసరం ఉన్నప్పుడు తలకు మసాజ్ చేసి, జుట్టు చివర్ల వరకు అప్లై చేయండి. రాత్రంతా డీప్ కండిషనింగ్ కోసం అలాగే ఉంచండి లేదా స్టైలింగ్ చేసే ముందు చివర్లకు అప్లై చేయండి.

ప్రయోజనాలు: ఆముదం నూనె జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. బాదం నూనె జుట్టుకు మెరుపు , మృదుత్వాన్ని అందిస్తుంది

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×