E-Paper
Advertisement

మండిపోతున్న ఎండలు.. వేసవిలో ప్రతి రోజు బైక్ రైడింగ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మండిపోతున్న ఎండలు.. వేసవిలో ప్రతి రోజు బైక్ రైడింగ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Advertisement

Bike Riding Summer Health Risk| బైక్ రైడింగ్ చేయడం సరదాగా ఉంటుంది. కానీ వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోవడం, అలసట, వడదెబ్బ వంటి ప్రమాదాలు త్వరగా వస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

ఎండలొ ప్రయాణం చాలా ప్రమాదకరం

తీవ్ర ఎండలో శరీర ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుంది. చెమట రూపంలో శరీరం నుంచి నీరు, లవణాలు బయటకు పోతాయి. దీనివల్ల డీహైడ్రేషన్, బలహీనత వస్తాయి. త్వరగా అలసట కలుగుతుంది. రోడ్లు కూడా వేడేక్కడంతో బైక్ టైర్లపై కూడా ఒత్తిడి పెరుగుతుంది.

రైడింగ్ చేసే ముందే నీళ్లు తాగండి

Advertisement

వేసవిలో బైక్ రైడింగ్ చేసే ముందు తగినంత నీరు తాగాలి. ప్రయాణంలో కూడా నీళ్లు తీసుకెళ్లాలి. తరచుగా చిన్న చిన్న సిప్స్ తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ కూడా మంచివి.

మధ్యాహ్నం వేళ రైడింగ్ చేయకపోవడం మంచిది

మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణం చేయకపోవడమే మంచిది. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో రైడింగ్ చాలా సురక్షితం. అప్పుడు ఎండ తీవ్రత, ట్రాఫిక్ తక్కువగా ఉంటాయి.

సరైన దుస్తులు ధరించండి:

Advertisement

వేసవిలో కూడా జాకెట్ వేసుకోవాలి. లేత రంగుల మెష్ జాకెట్లు, తేమను తొలగించే బట్టలు వాడండి. హెల్మెట్, చేతులకు గ్లవ్స్, సన్ గ్లాసెస్ తప్పనిసరి. ఇవి చర్మాన్ని ఎండల నుంచి కాపాడతాయి.

సన్ స్క్రీన్ ఉపయోగించండి

బైక్ రైడింగ్ చేసే ముందు చేతులు, మెడ వంటి బహిర్గతమయ్యే ప్రదేశాలకు సన్ స్క్రీన్ క్రీమ్ రాయాలి. హై ఎస్‌పిఎఫ్ సన్ స్క్రీన్ వాడటం వలన సన్ బర్న్ నివారిస్తుంది.

మధ్యలో విశ్రాంతి తీసుకోండి

ఎండలో నిరంతర ప్రయాణం చేసే శరీరంలో ఉష్ణోగ్రత, ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువ ప్రయాణం చేయాల్సి వస్తే మధ్యలో ఎక్కడైనా నీడలో విశ్రాంతి తీసుకుంటే శరీరం చల్లబడుతుంది. కాళ్లు, చేతులు సాగదీయడం వలన రక్త ప్రసరణ మెరుగవుతుంది.

వడదెబ్బ సంకేతాలు గుర్తించండి

తల తిరగడం, వికారం, తీవ్రమైన చెమట, కండరాల నొప్పులు.. ఇవి వడదెబ్బ సంకేతాలు. ఇలా అనిపిస్తే వెంటనే ఆగి, నీడలో విశ్రాంతి తీసుకోండి. తగినంత నీరు తాగండి, తీవ్రత ఎక్కువగా ఉంటే ఓఆర్ఎస్ తాగండి, పరిస్థితి సీరయస్‌గా ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.

వేసవి కోసం బైక్‌ని రెడీగా చేసుకోండి

టైర్ ప్రెషర్ చెక్ చేయండి. ఇంజిన్ ఆయిల్, కూలెంట్ లెవెల్స్ పరీక్షించుకోండి. బ్రేక్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి. ఈ చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాలను తప్పిస్తాయి.

తేలికపాటి ఆహారం తీసుకోండి

ప్రయాణానికి ముందు నూనె వంటకాలు, కారం ఎక్కువగా ఉన్న ఆహారం తినకూడదు. పండ్లు, దోసకాయ వంటి నీటి ఆహారాలు తినడం వలన శరీరానికి తేమ లభిస్తుంది.

సురక్షితమైన మార్గాలు ఎంచుకోండి

చెట్ల నీడ ఉన్న రోడ్లను ఎంచుకోవడం మంచిది. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాలను నివారించండి. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు రోడ్డపై జారే ప్రమాదం కూడా ఉంటుంది.

Also Read: చాణక్య నీతి.. అప్పు తీసుకోవడం మీకు అలవాటుగా మారిందా? ఈ దురలవాటుకు అసలు మూలం అదే

ఎమర్జెన్సీ  సామగ్రి తీసుకెళ్లండి

వాటర్ బాటిల్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక మందులు తీసుకెళ్లండి. ఫోన్ పూర్తిగా ఛార్జ్ చేసుకోండి. ఎమర్జెన్సీ నెంబర్స్ దెగ్గర పెట్టుకోండి.

Also Read: మీ వద్ద అప్పు తీసుకొని తిరిగి ఇవ్వాలనే ఉద్దేశం లేనివారిని ముందే గుర్తుపట్టండి.. ఇవే లక్షణాలు

Related News

హైబ్రిడ్ ఫిట్‌నెస్ అంటే ఏంటి? స్టామినా, బలం రెండూ పెంచే కొత్త వర్కౌట్స్

ప్రేమలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా పొసిసివ్

కిచెన్‌లో మీరు చేసే ఈ 9 తప్పుల వల్లే వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు..

పిల్లలు బొటనవేలు ఎందుకు చీకు తుంటారు? ఈ అలవాటు మాన్పించేందుకు ఈజీ టిప్స్ hi

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

Big Stories

Advertisement
×