Bhagavad Gita Shloka for Life Success| మనిషి ఎంత కష్టపడినా కొన్నిసార్లు అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతుంటాడు. అందుకు అవకాశాలు లేకపోవడమే కారణం కాకపోవచ్చు. మనిషిలో ఉండే కొన్ని చెడు అలవాట్లు కూడా విజయానికి అడ్డంకులుగా మారవచ్చు. ఇవి అదుపు తప్పితే సంబంధాలు దెబ్బతినడమే కాకుండా, కెరీర్, ఆర్థిక పరిస్థితులపైనా ప్రభావం పడుతుంది. అందుకే ఈ 3 అలవాట్లు అదుపులో పెట్టుకోవాలని శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించారు. ఆ శ్లోకం మన జీవితానికి ఇచ్చే ముఖ్యమైన సందేశం ఏమిటో తెలుసుకుందాం.
భగవద్గీతలోని 16వ అధ్యాయం, 21వ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనిషి పతనానికి కారణమయ్యే మూడు లక్షణాలను వివరించారు.
అర్థం: కోరికలు, కోపం, అత్యాశ అనేవి మనిషి పతనానికి మూడు ద్వారాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మూడు లక్షణాలు వదులుకోవాలి. ఈ బోధన రోజువారీ జీవితంలోనూ పాటించాలి. ముఖ్యంగా ఈ మూడు అలవాట్లను ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం.
జీవితంలో ఎదగాలంటే ఆశయాలు, లక్ష్యాలు ఉండటం అవసరం. అయితే ప్రతి విషయాన్నీ వెంటనే పొందాలనే కోరిక మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఇతరులతో పోల్చుకుంటూ వారి జీవనశైలిని అనుసరించాలని ప్రయత్నిస్తే అసంతృప్తి పెరుగుతుంది.
ఎలా పాటించాలి?
మీ పరిస్థితులకు తగిన లక్ష్యాలను నిర్ణయించుకోండి. ఇతరులతో పోల్చుకోకుండా మీ పురోగతిపై దృష్టి పెట్టండి. ఆశయాల కోసం కష్టపడండి. కానీ కోరికలు మీ జీవితాన్ని శాసించకుండా చూసుకోండి.
కోపంలో ఉన్నప్పుడు చాలామంది ఆలోచించకుండా మాట్లాడుతారు. ఆ సమయంలో అన్న మాటలు ఎదుటివారిని బాధ కలిగిస్తాయి. ఆ తర్వాత ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని సరిచేయడం కష్టమవుతుంది. కోపం.. వృత్తిపరమైన సంబంధాలు లేదా వ్యక్తిగత జీవితంలోనూ అంటే కుటుంబ సంబంధాల్లోనూ సమస్యలను సృష్టిస్తుంది.
కోపం వచ్చిన వెంటనే స్పందించకండి. కొంత సమయం తీసుకుని పరిస్థితిని అర్థం చేసుకోండి. ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది.
డబ్బు సంపాదించి మంచి జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అవసరానికి మించిన అత్యాశ తప్పుడు నిర్ణయాలకు దారితీయవచ్చు. త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొందరు అనవసరమైన రిస్కులు తీసుకుంటారు. మరికొందరు నిజాయతీని పక్కనపెడతారు.
ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగండి. నిజాయతీగా సంపాదించడానికే ప్రాధాన్యం ఇవ్వండి. త్వరగా లాభాలు పొందాలనే అత్యాశకు దూరంగా ఉండండి.
Also Read: ఒక్కసారిగా చెడు వార్త వింటే గుండెపోటు వస్తుందా? డాక్టర్ ఏం చెప్పారంటే
మనిషి జీవితంలో ఎదగాలంటే తన ఆలోచనలు, భావోద్వేగాలపై నియంత్రణ ఉండాలని శ్రీకృష్ణ భగవానుడు సూచించాడు. కోరికలను అదుపులో పెట్టుకోవడం, కోపాన్ని తగ్గించుకోవడం, అత్యాశకు దూరంగా ఉండటం వల్ల మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఇవి మన సంబంధాలను మెరుగుపరచడమే కాకుండా, వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధికి తోడ్పడతాయి. నిజమైన విజయం స్వీయ నియంత్రణతోనే మొదలవుతుందని భగవద్గీత బోధిస్తోంది.
Also Read: మీ లవర్‌ని ఇంటికి ఆహ్వానిస్తున్నారా? పేరెంట్స్‌కు పరిచయం చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి