Long Hair Tips: మోకాళ్ల వరకు పొడవైన, ధృడమైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ ప్రస్తుతం జుట్టు రాలడం, పొడిబారడం, నెమ్మదిగా పెరగడం వంటివి సాధారణ సమస్యలుగా మారాయి. ఇటువంటి పరిస్థితిలో.. మీరు కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా వీటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ఇవి జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. మీ జుట్టును మోకాళ్ల వరకు పొడవుగా చేయడంలో కూడా సహాయపడతాయి. ఎలాంటి హోం రెమెడీస్ జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉసిరి, కొబ్బరి నూనె:
జుట్టుకు ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా తెల్ల జుట్టు పెరగకుండా కూడా కాపాడుతుంది.
ఎలా వాడాలి ?
రెండు టీస్పూన్ల ఉసిరి పౌడర్ తీసుకొని, అర కప్పు కొబ్బరి నూనెతో కలపండి.
ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేసి, జుట్టు కుదుళ్లకు బాగా మసాజ్ చేయండి.
కనీసం గంట తర్వాత షాంపూతో జుట్టను వాష్ చేయండి.
ఈ నూనె తలకు పోషణనిచ్చి, జుట్టును బలంగా చేసి, వేగంగా పెరిగేలా చేస్తుంది.
2. మెంతులు, పెరుగు హెయిర్ మాస్క్:
మెంతులు జుట్టు పెరుగుదలకు సహాయపడే ప్రోటీన్, ఐరన్ లను కలిగి ఉంటాయి. పెరుగు జుట్టును తేమను అందిస్తుంది.
ఎలా వాడాలి ?
దీని కోసం.. మీరు 4 టీస్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి.
ఉదయం దాన్ని రుబ్బి, దానికి అర కప్పు పెరుగు వేసి పేస్ట్ లా చేయాలి.
దీని తరువాత దీనిని జుట్టు కుదుళ్లకు అప్లై చేయాలి.
అనంతరం 30-40 నిమిషాల తర్వాత షాంపూతో జుట్టును వాష్ చేయాలి.
ఈ హెయిర్ మాస్క్ జుట్టును మూలాల నుండి పోషించి బలపరుస్తుంది.
3. గుడ్డు, అలోవెరా జెల్:
గుడ్లలో జుట్టు పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్ ఉంటుంది. కలబంద తలకు ఉపశమనం కలిగించి, దురద ,చుండ్రు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఎలా వాడాలి ?
ఎగ్ వైట్ తీసుకుని దానికి 2 టీస్పూన్ల తాజా కలబంద జెల్ కలపండి.
దీన్ని బాగా కలిపి జుట్టుకు అప్లై చేయండి.
తరువాత, 30 నిమిషాలు అలాగే ఉంచి షాంపూతో వాష్ చేయండి.
ఈ మిశ్రమం జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. అంతే కాకుండా జుట్టును బలంగా చేస్తుంది.
4. ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది. ఇది కొత్త జుట్టు కణాలను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
Also Read: మెడపై మొటిమలా ? వీటిని వాడితే.. సమస్య దూరం
ఎలా వాడాలి ?
ముందుగా 1 ఉల్లిపాయను తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దాని రసాన్ని తీయాలి.
అనంతరం దీనిని కాటన్ బాల్ సహాయంతో జుట్టు కుదుళ్లపై అప్లై చేసి 30 నిమిషాల తర్వాత షాంపూతో వాష్ చేయండి.
ఉల్లిపాయ రసం తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.