E-Paper
Advertisement

రూ.99,990కే 75 ఇంచుల బిగ్ స్క్రీన్ టీవీ..ఇంట్లోనే పక్కా థియేటర్ వైబ్స్!

రూ.99,990కే 75 ఇంచుల బిగ్ స్క్రీన్ టీవీ..ఇంట్లోనే పక్కా థియేటర్ వైబ్స్!
Advertisement

TCL 75 inch QD Mini LED TV: ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో.. స్మార్ట్ టీవీల జోరు మామూలుగా లేదు. చిన్న స్క్రీన్ల రోజులు పోయి, ఇప్పుడు బిగ్ స్క్రీన్ హోమ్ థియేటర్ ఫీల్ అందించే పెద్ద టీవీల ట్రెండ్ నడుస్తోంది. మీ ఇంట్లోనే.. సినిమా థియేటర్ వైబ్స్ తెప్పించడానికి ప్రముఖ బ్రాండ్ TCL ఒక అద్భుతమైన మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అదే ఈ స్మార్ట్ టీవీ. ఈ టెక్ గాడ్జెట్ ప్రస్తుతం టెక్కీలు, మూవీ లవర్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ఈ అద్భుతమైన టీవీ ధర కేవలం రూ.99,990 మాత్రమే కావడం విశేషం. దీని స్పెషల్ ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1. అద్భుతమైన డిస్ప్లే & 512+ జోన్స్:

ఈ టీవీ మెయిన్ హైలైట్ దీని డిస్ప్లే టెక్నాలజీ. ఇందులో .. క్యూడి మిని ఎల్ఈడీ టెక్నాలజీని వాడారు. ఇది సాధారణ ఎల్ఈడీ టీవీల కంటే చాలా రెట్ల బ్రైట్‌నెస్, డీప్ బ్లాక్స్, వైబ్రెంట్ కలర్స్‌ను అందిస్తుంది. అంతే కాకుండా.. ఇందులో.. Upto 512+ లోకల్ డిమ్మింగ్ జోన్స్ ఉన్నాయి. దీని వల్ల చీకటి సీన్లలో.. కూడా పిక్చర్ క్లారిటీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 4K UHD రిజల్యూషన్ తో.. వచ్చే ఈ స్క్రీన్ మీద సినిమాలు చూస్తుంటే.. నిజంగా థియేటర్‌లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది.

2. గేమర్లకు పర్ఫెక్ట్:

Advertisement

మీకు వీడియో గేమ్స్ ఆడడం ఇష్టమా? అయితే.. ఈ టీవీ మీకోసం పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఇందులో అద్భుతమైన 144Hz రీఫ్రెష్ రేట్ సపోర్ట్ లభిస్తుంది. దీని వల్ల గేమింగ్ లేదా హై-స్పీడ్ యాక్షన్ సీన్స్ చూస్తున్నప్పుడు.. ఎలాంటి లాగ్ లేదా బ్లర్ లేకుండా.. చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. అలాగే .. ఇందులో పవర్ ఫల్ 3GB RAM ఉండటం వల్ల టీవీ చాలా ఫాస్ట్‌గా, ఎలాంటి హ్యాంగ్ సమస్యలు లేకుండా పని చేస్తుంది. అప్స్ అండ్ డౌన్స్ లేని పర్ఫార్మెన్స్ దీని మరో ప్రత్యేకత.

3.థియేటర్ సౌండ్ :

మంచి పిక్చర్ క్వాలిటీ ఉన్నప్పుడు.. దానికి తగిన సౌండ్ లేకపోతే మజా రాదు. అందుకే..  ఈ టీవీలో పవర్‌ ఫుల్ సౌండ్ సిస్టమ్ అందించింది. ఇందులో.. బిల్ట్-ఇన్ సబ్-వూఫర్ ఉండటం వల్ల బేస్ చాలా పవర్‌ ఫుల్‌గా వస్తుంది. సినిమాలోని ప్రతి డైలాగ్, మ్యూజిక్ చాలా క్లియర్‌గా వినిపిస్తాయి. బయట ఎలాంటి హోమ్ థియేటర్ స్పీకర్లు కొనాల్సిన అవసరమే లేకుండా.. ఈ ఒక్క టీవీ సౌండే చాలు.

Advertisement

Also Read: అమెజాన్ సేల్ ధమాకా..రూ.10వేలలోపే సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు!

4. స్మార్ట్ గూగుల్ టీవీ ఫీచర్లు:

మీరు ఓటీటీ ప్లాట్‌ ఫారమ్‌లలో ఐమాక్స్ కంటెంట్‌ని బెస్ట్ క్వాలిటీలో చూసే ఆప్షన్ ఈ టీవీలో ఉంటుంది. ఇక ఇది లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్, యూట్యూబ్ వంటి అన్ని ప్రముఖ యాప్స్‌ను ఇందులో ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. వాయిస్ కంట్రోల్ అవకాశం కూడా దీనిలో ఉండటంతో కేవలం మీ మాటలతోనే టీవీని ఆపరేట్ చేయెచ్చు.

పెద్ద స్క్రీన్, అదిరి పోయే పిక్చర్ క్వాలిటీ, సూపర్ సౌండ్ సిస్టమ్ అన్నీ ఒకే చోట కావాలనుకునే.. వారికి ఈ మోడల్ టీవీ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మార్కెట్లో లభించే.. ఇతర లగ్జరీ బ్రాండ్లతో పోలిస్తే.. కేవలం రూ.99,990 ధరకే ఇన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లు లభించడం నిజంగా అదిరి పోయే విషయమే. మీ లివింగ్ రూమ్‌ను ఒక సినిమా థియేటర్‌లా మార్చుకోవాలనుకుంటే.. ఈ మోడల్ తప్పకుండా ట్రై చేయెచ్చు!

Related News

తగ్గేదే లే అంటున్న boAt కొత్త ఇయర్‌బడ్స్..రూ.1299కే కిరాక్ ఫీచర్లు!

ట్రెండింగ్ డిజైన్‌తో వస్తున్న OnePlus Buds Clip.. ఫీచర్లు చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే!

ఒకేసారి 3 డివైజ్‌లు ఛార్జ్ చేయొచ్చు! రూ.1,099కే అదిరిపోయే పవర్ బ్యాంక్ డీల్!

ఇక వాట్సప్ చాట్ నుంచే డైరెక్ట్‌గా రీల్స్ షేరింగ్.. కొత్త ఫీచర్ వచ్చేస్తోంది మామా!

అమెజాన్ సేల్ ధమాకా..రూ.10వేలలోపే సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు!

కొత్త ఫోన్ కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి.. ఎన్నేళ్ల వరకు విడిభాగాలు దొరుకుతాయంటే?

కొత్త ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ సేల్‌లో ట్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లపై భారీ తగ్గింపు

Big Stories

Advertisement
×