Monkeypox: కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో ఈ ఏడాది తొలి మంకీ పాక్స్ కేసు నమోదైంది. 40 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి దుబాయ్ నుండి జనవరి 17 , 2025 న ఇండియాకు తిరిగి వచ్చాడు. మంగళూరుకు చేరుకున్న ఇతడిలో వచ్చిన రెండు రోజులకే తీవ్రమైన జ్వరం , తలనొప్పి, కండరాల నొప్పులు, చలి, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. సదరు వ్యక్తి వైద్యులను సంప్రదించగా బ్లడ్ షాంపిల్స్ సేకరించిన డాక్టర్లు జనవరి 22న మంకీ పాక్స్ కేసుగా నిర్ధారించారు. ఇంతకీ మంకీ ఫాక్స్ ఎలా సోకుతుంది ? ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మంకీపాక్స్ ఎలా వ్యాపిస్తుంది ?
మంకీపాక్స్ అనేది ఒక అంటు వ్యాధి. ఇది ప్రధానంగా వ్యాధి సోకిన వ్యక్తి లేదా జంతువుతో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి యొక్క గాయాలు, ద్రవాలు, సోకిన పదార్థాలతో సంబంధం ద్వారా కూడా వ్యాపిస్తుంది. మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ సాధారణంగా 2 నుండి 4 వారాల వరకు ఉంటుందని వెల్లడైంది. వ్యాధి సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం ద్వారా ముఖ్యంగా సెక్స్ సమయంలో లేదా సోకిన వ్యక్తి యొక్క గాయాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాపిస్తుంది.
మంకీపాక్స్ యొక్క లక్షణాలు:
మంకీపాక్స్ యొక్క లక్షణాలు సాధారణంగా వ్యాధి సంక్రమణ తర్వాత 5 నుండి 21 రోజులలో కనిపిస్తాయి.
జ్వరం
తలనొప్పి
కండరాల నొప్పి
వెన్ను నొప్పి
చల్లని అనుభూతి
ఆయాసం
బాధాకరమైన, దద్దుర్లు
వాచిన శోషరస గ్రంథులు
కొన్ని సందర్భాల్లో రోగులు ఈ క్రింది లక్షణాలను కూడా కలిగి ఉండవచ్చు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
మింగడం కష్టం అవుతుంది.
కళ్ళలో వాపు
డాక్టర్లను ఎప్పుడు సంప్రదించాలి ?
మీరు ఈ మంకీపాక్స్ లక్షణాలను గమనించినట్లయితే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
సోకిన వ్యక్తులకు, జంతువులకు దూరంగా ఉండండి.
సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించండి.
సబ్బు, నీటితో తరచుగా మీ చేతులను కడగాలి.
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించండి.