BigTV English

History of Saree: చీరకు ఇంత చరిత్ర ఉందా.. అప్పట్లో అస్సలు రవికే ధరించేవారు కాదట, కానీ…

History of Saree: చీరకు ఇంత చరిత్ర ఉందా.. అప్పట్లో అస్సలు రవికే ధరించేవారు కాదట, కానీ…

చీర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రపంచంలోనే అతి పెద్ద ధరించే వస్త్రాలలో చీర ఒకటి. భారతదేశంలో సాంప్రదాయ బద్దమైన ఈ చీర నాలుగు నుండి తొమ్మిది మీటర్ల పొడవు ఉంటుంది. చీర చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.


చరిత్రలో చూసుకుంటే సింధులోయ నాగరికతలోనే స్త్రీలు బట్టలు ధరించే వారిని చెబుతారు. రామాయణ, మహాభారతాలలో కూడా స్త్రీల  వస్త్రధారణ గురించి ప్రస్తావన ఉంది. చంద్రగుప్తుని కాలంలో పాటలీపుత్రానికి వచ్చిన గ్రీకు రాయబారి మెగాస్తనీసు కూడా భారత స్త్రీల వస్త్రాల గురించి తన పుస్తకంలో రాశాడు. అతను బంగారు జరీతో విలువైన రాళ్లు పొదిగిన వస్త్రాలను భారతీయ మహిళలు ధరించే వారిని తన పుస్తకంలో ప్రస్తావించాడు. ప్రాచీన కాలపు చిత్రాలలో రాత్రి విగ్రహాలలో కూడా చీరలాంటి వస్త్రం కనిపిస్తూనే ఉంది.

అజంతా గోడలపై ఉన్న కుడ్య చిత్రాల్లో కూడా చీరలాంటి వస్త్రాలు కనిపించాయి. పత్తినూలు, పట్టుచీరలతో తయారుచేసిన చీరలను అప్పట్లో ధరించే వారని అంటారు. పేదవారు పత్తితో చేసినవి ధరిస్తే, ధనవంతులు పట్టు వస్త్రాలను ధరించే వారని అంటారు.
మధ్యయుగంలో నుంచి చీరలకు ప్రాముఖ్యత పెరిగింది. ప్రాచీన కాలంలో అనేక రకాల చీరలు ఉండేవి. వాటిలో ముఖ్యమైనవి నీలాంబరి, ఆస్మాన్ తార, ధూప్ చాన్ వంటివి.


బంగ్లాదేశ్ రాజధాని నగరమైన డాకాలో కూడా చీరలు నేసేవారని అంటారు. విదేశాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చి దాకా మస్లిన్ చీరలు కొనుక్కునే వారిని అంటారు. ఈ చీరలు చాలా పలుచగా ఉంటాయని చెబుతారు.

చీరల్లో ఎన్నో రకాలు ఉన్నాయి.  సిల్క్ చీరలు, నైలాన్ చీరలు, పట్టు చీరలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చీరల మార్కెట్ ఇప్పుడు బాగా విస్తరించింది ఇప్పుడు. ఒక్కో రాష్ట్రం ఒక్కో చీర పద్ధతికి ప్రసిద్ధి చెందింది. వారణాసికి చెందిన బెనారస్ చీరలు, కాంచీపురానికి చెందిన కంచి చీరలు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ధర్మవరం,  వెంకటగిరి, గద్వాల్, పోచంపల్లి, కర్ణాటకకు చెందిన మైసూరుపట్టు, బెలగాం పట్టు, గుజరాత్ కు చెందిన బందానీ చీరలు ఇప్పుడు ఎంతో ఫేమస్. చీరల మార్కెట్ వందల కోట్ల రూపాయల మార్కెట్ చేస్తున్నాయి.

Also Read:  ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన అనుబంధం ఇదే, దీన్ని కాపాడుకుంటేనే ఆనందం

బ్రిటిష్ సామ్రాజ్యం మన దేశానికి రాకముందు ఈ చీరల లోపల రవిక లేకుండా ధరించేవారు. బ్లౌజ్ లెస్ చీరలు ధరించడం కొన్ని వేల ఏళ్ల పాటు సాగింది. ఆ తరువాత బ్రిటీష్ వారు మన దేశానికి వచ్చాక వారు బ్లౌజులను వేసుకోవడం ప్రోత్సహించారు. ఏది ఏమైనా ఇప్పుడు చీరల ధరలు కూడా ఆకాశాన్ని ఉంటాయి. లక్షల్లో ఖరీదు చేసే పట్టు చీరలు మార్కెట్లో ఉన్నాయి. ఇప్పటికీ చీర విలువ ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు రోజుకు డిజైన్లు.. కట్టుకొనే స్టైల్ మారుతుందేమో గానీ.. దాని ఉనికిలో మాత్రం ఏ మాత్రం మార్పులేదు. ఏ ఫంక్షన్ వచ్చిన చీర ధరించాల్సిందే. అంతేకాదు.. మగాళ్లకు సైతం చీర కట్టుకొనే మగువలంటేనే ఎక్కువ మక్కువ. అందుకే, శారీ వర్థిల్లాలి.

Related News

Navratri Special Recipes: నవరాత్రి స్పెషల్ వంటకాలు.. నైవేద్యంలో తప్పకుండా ఇవి ఉండాల్సిందే !

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Big Stories

×