Sundeep Kishan – kiran Abbavaram : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘క ‘ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ దీపావళికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో ఈ క మూవీ కూడా ఒకటి.. కిరణ్ అబ్బవరం హీరోగా సుజిత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క. దీపావళి సందర్భంగా భారీ కాంపిటీషన్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ 20 నిమిషాలు ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తోంది.. ఈ సినిమా మొదటి వారం రోజులు బాక్సాఫిస్ వద్ద కాసుల సునామి సృష్టించింది. ఇక తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా సందీప్ కిషన్ హాజరయ్యాడు.
క మూవీ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన దిల్ రాజు ఈ మధ్య యువ హీరోల సినిమాలకు తెలుగు ఇండస్ట్రీలో సపోర్ట్ రావాట్లేదని అని వస్తున్న వార్తలపై స్పందించాడు.. ఆయన మాట్లాడుతూ.. యువ హీరోలకు ఒకటే చెబుతున్న. ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి. ఎవడో ఎదో అంటున్నాడు అని మీరు భయపడకుడదు. కిరణ్‌కు ప్రతిభ ఉంది కాబట్టే క సినిమాతో ఈరోజు సక్సెస్ అయ్యాడు. మీ దర్శకుల దగ్గర ట్యాలెంట్ ఉంది కాబట్టి సక్సెస్ అయ్యాడు. ఈరోజు క మూవీ ఇంత విజయాన్ని అందుకోవడానికి కారణం దర్శకుల కష్టం, హీరో పట్టుదల అని చెప్పాడు దిల్ రాజు.
ఆ తర్వాత యంగ్ హీరో సందీప్ కిషన్ మాట్లాడారు.. క సినిమా బాగా వచ్చిందని పొగిడారు.. ఈ సినిమా కోసం హీరో చాలా కష్ట పడ్డారు. ఇప్పటివరకు ఆయన పడిన కష్టం వృధాగా పోలేదు. ఒక పండగకు సినిమా రిలీజ్ చెయ్యాలంటే చాలా కష్టం. అలాంటిది కిరణ్ మూవీకి దొరికింది.. 15 ఏళ్లుగా ట్రై చేస్తున్న నావి ఒక్క సినిమా కూడా పండగగు రాలేదు.. నేను సాధించలేనిది కిరణ్ కొట్టాడు. ఇలాంటి సక్సెస్ లు ఇంకా అందుకోవాలని సందీప్ కిషన్ క టీమ్ కు అభినందనలు తెలిపారు. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ప్రజెంట్ క సినిమాను చూస్తే.. తెలుగు స్టేట్స్‌లో మంచి వసూళ్లు అందుకుంది. ఈ మూవీ వారం రోజుల్లోనే రూ. 40 కోట్లవరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. రెండు రోజులుగా కలెక్షన్స్ జోరు తగ్గింది. వేరే లాంగ్వేజెస్‌లోనూ అదే రేంజ్‌లో సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది చిత్రయూనిట్. మరి నిజంగానే కిరణ్ ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో ప్రూవ్ చేసుకుంటారేమో చూడాలి. ఇండియా రిలీజ్‌కు రెడీ అవుతున్నారు క మేకర్స్. నవంబర్ 15న మలయాళంలో రిలీజ్ చేసి, ఆ తరువాత నవంబర్ 22న తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు..