సోలో పాలిమరీ ట్రెండ్ అంటే
ఇప్పటి యువత స్వేచ్ఛను కోరుకుంటుంది. రోజుకొకరిని ఇష్టపడే వ్యక్తులు కూడా ఉన్నారు. ఒక్కరితోనే జీవితాంతం ఉండడం ఇష్టం లేనివారు ఈ సోలో పాలిమరీ ట్రెండును ఫాలో అవుతున్నారు. ఒక వ్యక్తితో ఒకరోజు లేదా ఒక వారం, ఒక నెలపాటు ప్రయాణం చేస్తారు. అతడిని వదిలేసి ఇతరులతో కూడా ప్రేమలో పడుతూ ఉంటారు. వారితో లైంగిక అనుబంధాలు కొనసాగిస్తారు. అయినా కూడా మాజీ ప్రేమికులు ఎలాంటి సమస్యలు తీసుకురారు. అదే సోలో పాలిమరీ ట్రెండ్.
ఎక్కువమంది భాగస్వాములతో ప్రేమ అనుబంధం కలిగి ఉండడం అనేది అనైతికమైనది. ఈ సోలో పాలిమరీ ట్రెండ్‌ను ఫాలో అయ్యేవారు బహిరంగంగా, నిజాయితీగా తమకు ఎక్కువ మంది ప్రేమికులు ఉన్నట్టు చెబుతారు. వారి జీవనశైలి కూడా అదే విధంగా ఉంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛ విపరీతంగా ఉంటుంది. భావోద్వేగాలకు ఎలాంటి విలువ ఉండదు.
సోలో పోలోమరి ట్రెండ్ ఫాలో అయ్యేవారు జీవితంలో ఒక భాగస్వామితో జీవించలేక చాలా ఇబ్బంది పెడతారు. చివరికి వారు ఒంటరి వారిగా కూడా మారిపోతారు. ఎందుకంటే తమని తాము ఎవరికీ కట్టుబడి ఉంచుకోలేరు. ఎక్కువ మంది వ్యక్తులకు ఆకర్షితులు అవుతూ ఉంటారు. సాంప్రదాయ సంబంధాలకు విలువ ఇవ్వరు. ఇలాంటివారు ఎప్పటికైనా ఒంటరిగానే మిగులుతారు. దీర్ఘకాలిక అనుబంధాలు మాత్రమే ఈ ప్రపంచంలో శాశ్వతమైనవి, విలువైనవి. అందుకే ప్రతి దానికి ఒక నిబంధన, ఒక పద్ధతి అంటూ ఉంటుంది.
పెళ్లి చేసుకోరు
ఈ సోలో పాలిమరి ట్రెండును ఫాలో అయ్యే వారు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. పెళ్లి వల్ల ఒకరితోనే జీవించాలన్నది వారిని భయాందోళనకు గురిచేస్తుంది. ఆ ఒక్కరిని కనుగొనలేక చాలా ఇబ్బంది పడతారు. పెద్దల బలవంతం మీద వివాహం చేసుకున్నా ఆ పెళ్లిల్లో ఇమడ లేక తక్కువకాలంలోనే విడాకులు తీసుకుంటారు.
స్త్రీలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా సోలో పోలిమరి వైపు మొగ్గు చూపుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. డేటింగ్ ప్లాట్ ఫామ్ అయినా బంబుల్ నిర్వహించిన సర్వేలో 61 శాతం మంది భారతీయులు బహు భార్యత్వాన్ని కోరుకుంటున్నట్టు తేలింది.