BigTV English

Green Peas: పచ్చి బఠాణీతో ప్రయోజనాలు మామూలుగా లేవు.. తెలిస్తే షాక్ అవుతారు..

Green Peas: పచ్చి బఠాణీతో ప్రయోజనాలు మామూలుగా లేవు.. తెలిస్తే షాక్ అవుతారు..

Green Peas: పచ్చి బఠాణీలను తరచూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. సాధారణంగా కూరగాయలకు సీజన్లు ఉంటాయి. సీజన్లను బట్టి కూరగాయలు దొరుకుతుంటాయి. అందులో కొన్ని కూరగాయలు మాత్రం ప్రతీ సీజన్ లోను లభిస్తాయి. అందులో ముఖ్యమైనది బఠాణీలను. అయితే వీటిని చాలా మంది తేలికగా తీసిపారేస్తుంటారు. వీటితో కేవలం సాధారణమైన ఉపయోగాలు మాత్రమే ఉంటాయని అనుకుంటారు కానీ వీటితో ఉండే ప్రయోజనాలు అంతా ఇంతా కావని నిపుణులు చెబుతున్నారు. బఠాణీలలో విటమిన్ కె,ఈ, బి, ఎ, మెగ్నిషీయం, జింక్, ఎపికాటెచిన్, పొటాషియం వంటి అనేక పోషకాలు, విటమిన్ లను అందిస్తుంది.


తరచూ మారుతున్న జీవనశైలి కారణంగా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇటువంటి గింజలను తప్పక తీసుకోవాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఇవి శరీరంలోని అనేక అనారోగ్య సమస్యలను నివారిచడంతో ముఖ్య పాత్రను పోషిస్తాయి. జీర్ణక్రియ మెరుగుపరచేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాదు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మంచి ప్రయోజనాలు అందిస్తుంది. అయితే వీటిలో జీఐ స్థాయి తక్కువగా ఉండడం వల్ల ఇది శరీరంలోని చక్కెరను నియంత్రించేందుకు తోడ్పడుతుంది. మరోవైపు బ్లడ్ షుగర్ వంటి వాటిని కూడా కంట్రోల్ చేసుందుకు సహాయం చేస్తుంది.

ముఖ్యంగా బఠాణీలలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. పచ్చి బఠాణీలను తరచూ ఏదో ఒక రకంగా తీసుకోవడం వల్ల శరీరంలోని జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసుకోవచ్చు. ఇక కడుపు సంబంధింత సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. తరచూ ఆహారంలో భాగంగా బఠాణీలను తీసుకోవడం వల్ల తగిన ప్రోటీన్లు శరీరానికి అంది, ఐరన్, ఫోలేట్, విటమిన్ ఏ వంటివి కండరాలను బలోపేతం చేసి బరువు తగ్గేందుకు సహాయపడతాయి.


ఇక శరీరంలోని కొలస్ట్రాల్ ను బఠాణీలలో ఉండే ఫైబర్ తొలగిస్తుంది. దీంతో గుండె సంబంధింత సమస్యలతో బాధఫడేవారికి ఉపశమనం పొందవచ్చు. ఎక్కువగా బఠాణీలను శీతాకాలంలో తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే సాధారణంగా కూడా ఇవి ఆరోగ్య సమస్యలను దూరం చేసేందుకు చక్కగా పనిచేస్తుంది. బఠాణీలను కూరలుగా లేక సూప్స్, నూడుల్స్, ఫ్రైడ్ రైస్ వంటి రకరకాల వంటకాల్లో ఉపయోగించుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి.

Related News

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×