మధుమేహంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు ఆహారం సరిగా తినకపోతే రక్తంలో చక్కర స్థాయిలు పెరిగిపోతాయి. ఇది డయాబెటిస్ రోగులకు సమస్యలు తెచ్చిపెడుతుంది. చక్కెర రోగులు తమ ఆహారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. వైద్యుడిని సంప్రదించాకే కొత్త ఆహారాలను ప్రయత్నించాలి. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలు తినడం ప్రమాదకరం. మీకు తెలియకుండానే మీరు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న కూరగాయలను తినేస్తున్నారు. ఇది రక్తంలో చక్కెరను వేగంగా పెంచేస్తాయి.
బంగాళాదుంపలు
బంగాళాదుంపలు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. ఒకపక్క డయాబెటిస్ మందులు వేసుకుంటేనే మరోపక్క బంగాళదుంపలతో వంటలు తినేవారు ఎంతోమంది ఉన్నారు. డయాబెటిస్ ఉన్న రోగులు బంగాళదుంపలను తినకూడదు. ఇవి అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెరను ఇది చాలా ప్రభావితం చేస్తాయి. బంగాళాదుంపలలో అధిక కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి త్వరగా జీర్ణమై చక్కెరగా మారుతాయి. దీనివల్ల రక్తంలో చక్కర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది.
క్యాప్సికం
క్యాప్సికం ఆరోగ్యానికి మంచిదే. కానీ డయాబెటిస్ ఉన్నవారు మాత్రం క్యాప్సికం ను చాలా తక్కువగా తినాలి. క్యాప్సికంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కానీ చక్కెర అధికంగా ఉంటుంది. అందుకే క్యాప్సికం ను వండుకొని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అధికంగా పెరిగే అవకాశం ఉంది.
బీట్రూట్
రక్తాన్ని పెంచేందుకు బీట్రూట్ ను అధికంగా తింటూ ఉంటారు. అయితే బీట్రూట్ మధుమేహ రోగులకు మాత్రం హానికరం కావచ్చు. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ మీడియం నుంచి ఎక్కువ స్థాయిలో ఉంటుంది. బీట్రూట్ ను అధికంగా తింటే డయాబెటిక్ రోగులకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీట్రూట్లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తుంది. డయాబెటిస్ రోగులు బీట్రూట్ ని చాలా తక్కువగా తింటే మంచిది.
క్యారెట్
క్యారెట్ ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. కానీ డయాబెటిస్ రోగులు మాత్రం క్యారెట్లను ఆచితూచి తినాలి. ఈ క్యారెట్ లను ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. వాటి జిఐ కూడా మద్యస్థంగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు క్యారెట్లను అప్పుడప్పుడు మాత్రమే తినాలి. తరచూ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది.
షుగర్ పేషెంట్లు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న కూరగాయలను తింటే ఆరోగ్యకరం. అంటే పాలకూర, బెండకాయ, గుమ్మడికాయ, పచ్చి బఠానీలు వంటివి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పండ్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు వేయించిన ఆహారాలు తినకూడదు. ఇది ఆహారంలో చక్కెర రక్తంలో చక్కర స్థాయిలు పెంచేస్తాయి.
Also Read: చైనా, జపాన్లో రాత్రిళ్లు మాత్రమే స్నానం చేస్తారెందుకు? ఎప్పుడు చేస్తే మంచిది?