BigTV English

Allu Arjun: నైజాం నవాబ్ ఆన్ డ్యూటీ… రీరిలీజ్ రికార్డులు చెక్కేస్తున్నాడు

Allu Arjun: నైజాం నవాబ్ ఆన్ డ్యూటీ… రీరిలీజ్ రికార్డులు చెక్కేస్తున్నాడు

Allu Arjun: అల్లు అర్జున్‌కి నైజాం ఏరియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతుంటే, అది ప్రేక్షకుల కోసం ఓ పండగలా మారిపోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని అన్ని మేజర్ సెంటర్స్  లో బన్నీకి ఉన్న ఫ్యాన్‌ బేస్, ఆయన క్రౌడ్ పుల్ కెపాసిటీ సూపర్ అనే చెప్పాలి. బన్నీ సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్ల దగ్గర హంగామా, స్పెషల్ షోలు, బిగ్ కటౌట్లు ఇవన్నీ ఓ ఫెస్టివల్ వాతావరణాన్ని తీసుకువస్తాయి.


ఇది కేవలం పుష్ప సినిమా తర్వాత ఏర్పడిన క్రేజ్ కాదు. అల వైకుంఠపురములో, సరైనోడు, జులాయి, రేసుగుర్రం లాంటి సినిమాల దగ్గర నుంచే బన్నీ నైజాంలో స్ట్రాంగ్ మార్కెట్ ఏర్పరచుకున్నాడు. అల వైకుంఠపురములో అయితే ఏకంగా ₹44 కోట్లకు పైగా షేర్ రాబట్టి రికార్డులు తిరగరాసింది. ఇక పుష్ప: ది రూల్ గురించి చెప్పాలంటే, నైజాంలోనే ₹100 కోట్లకు పైగా  వసూళ్లు సాధించి బన్నీ స్టామినా ఏ రేంజ్‌లో ఉందో మరోసారి నిరూపించింది.

ఆర్య 2’ రీరిలీజ్


అల్లు అర్జున్ బర్త్‌డే కానుకగా ఆర్య 2 రీరిలీజ్ అవుతోంది. ఈ సినిమా రీరిలీజ్‌కు టిక్కెట్లు బుకింగ్ ఓపెన్ చేసిన వెంటనే కొన్ని థియేటర్లలో Sold Out కావడం చూస్తే బన్నీ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. హైదరాబాద్‌లోని సంధ్య 35mm, బ్రహ్మరాంభ 70mm థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే టిక్కెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయి. 15 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా ఇలా ఓ రేంజ్‌లో బుకింగ్ అవ్వడం బన్నీ నైజాం ఫాలోయింగ్‌ను మరోసారి నిరూపిస్తోంది. ఇప్పటికే గతంలో దేశముదురు  రీరిలీజ్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆర్య 2 కూడా అదే రేంజ్‌లో దూసుకెళ్తుందా? అల్లూ అర్జున్ రీరిలీజ్ మూవీస్ కలెక్షన్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడా? అన్నది చూడాలి.

బన్నీ బర్త్ డే సర్ప్రైజ్…

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్ గా… రెండు సినిమాల నుంచి అప్డేట్స్ బయటకి వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన మైథలాజికల్ మూవీ గురించి అఫీషియల్ గా ఒక అప్డేట్ బయటకి వచ్చే అవకాశం ఉంది. జూన్ లో లుక్ టెస్ట్ కి బన్నీ రెడీ అవుతున్నాడు, ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీగా ఉంటుందని నాగ వంశీ ఇటివలే స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఫ్యాన్స్ కి ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చే అప్డేట్ ఇది స్పెషల్ సర్ప్రైజ్ అవనుంది. ఇక అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఆరోజే బయటకి రానుంది. ఈ రెండు సర్ప్రైజ్ లు పాన్ ఇండియా బజ్ జనరేట్ చేయడం గ్యారెంటీ.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×