BigTV English

Revenge Thriller OTT : మైండ్ బ్లాక్ అయ్యే సీన్లతో రివేంజ్ మూవీ.. ఇంత దారుణమా..

Revenge Thriller OTT : మైండ్ బ్లాక్ అయ్యే సీన్లతో రివేంజ్ మూవీ.. ఇంత దారుణమా..

Revenge Thriller OTT : ఈమధ్య సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సినిమా వాళ్ళు రకరకాల కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మొన్నటి వరకు హారర్ సినిమాలకు ఎక్కువగా డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు రివేంజ్ థ్రిల్లర్ సినిమాలకు, మిస్టరీ స్టోరీలతో వచ్చే చిత్రాలపై ఎక్కువగా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేక్షకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని చిత్ర దర్శక నిర్మాతలు అలాంటి సినిమాలను తెరకెక్కించేందుకు కథలను రాస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలు బాగా క్లిక్ అయ్యాయి. తాజాగా రివెంజ్ థ్రిల్లర్ మూవీ ఓటిటిలోకి వచ్చేసింది. ఆ మూవీ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


మూవీ & ఓటీటి.. 

మలయాళ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులకు కొత్తగానే ఉంటాయి. చిన్న చిన్న కథలతో వచ్చిన సినిమాలు సైతం ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాయి. ఇక ఓటిటిలోకి కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలను కూడా నిర్వాహకులు స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు. అలాంటి ఓ సినిమా ది టీచర్.. ఈ మూవీ రెండేళ్ల క్రితం మలయాళం లో రిలీజ్ అయింది. అమలా పాల్ ( AmalaPaul) లీడ్ రోల్లో నటించింది. ఓ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పాత్రలో ఆమె నటించిన మూవీ ఇది.. ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. రెండేళ్ల తర్వాత ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ఈ సినిమాను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.


Also Read : ‘కల్కి 2’ లో మరో బాలీవుడ్ బ్యూటీనా.. డైరెక్టర్ ప్లానేంటి..?

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

ఈ మూవీ మొత్తం ఒక ఫిజికల్ టీచర్ చుట్టు తిరుగుతుంది. ఓ రోజు స్కూల్లో ఈవెంట్ తర్వాత ఆమె ఇంటికి తిరిగి వస్తుంది. మరుసటి రోజు ఒంటి గాయాలు కావడం చూసుకొని షాక్ తింటుంది. అసలు అంతకుముందు రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఓ స్టూడెంట్ ఇంటికి వెళ్తుంది.. ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంది అక్కడ జరిగింది చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయంపై ఆమె ఎలా ఫైట్ చేస్తుంది? కట్టుకున్న భర్త ఛీ పొమ్మన్నా.. తన అత్త ఇచ్చిన ధైర్యంతో తనకు అన్యాయం చేసిన వాళ్లపై ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనే లైన్ తో స్టోరీని తెరకేక్కించారు.. ఈ స్టోరీలో అక్కడక్కడా తడబడిన కూడా ఓవరాల్ గా సినిమా అయితే ప్రేక్షకులకు ఆసక్తి కలిగించింది. ఊహకందని క్లైమ్యాక్స్ కూడా ది టీచర్ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. థ్రిల్లర్, రివేంజ్ థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది..

ఇక అమలా పాల్ ఈమధ్య ఆమె రెండో పెళ్లి చేసుకుంది. తన పండంటి కాపురానికి పండంటి బిడ్డ పుట్టారు. ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆమె మరో సినిమాలను కూడా చేసేందుకు రెడీ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లేటెస్ట్ ఫోటోలను తన పర్సనల్ విషయాల గురించి షేర్ చేసుకుంటూ ఉంటుంది.

Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×