BigTV English

Weight Lose: బరువు తగ్గాలంటే.. ఇవి అస్సలు తినకూడదు !

Weight Lose: బరువు తగ్గాలంటే.. ఇవి అస్సలు తినకూడదు !

Weight Lose: బరువు తగ్గాలని అనుకునే వారు చాలా మంది ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతుంటారు. కానీ సరైన అవగాహన లేకపోతే కొన్ని సార్లు తినే ఆహారం కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడకపోగా పెరిగేలా చేస్తుంది. ఇదిలా ఉంటే బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. దీనికి చాలా కృషి, బలమైన సంకల్సం కూడా అవసరం. మరి బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


కూల్ డ్రింక్స్:
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం మీరు ఎనర్జీ డ్రింక్స్, సోడా , బయట మార్కెట్‌లో దొరికే పండ్ల రసాలను తప్పకుండా నివారించండి. ఎందుకంటే వాటిలో అధిక మొత్తంలో చక్కెర , చాలా తక్కువ పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శీరరంలో అదనపు కేలరీలు పెరుగుతాయి. కానీ ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపించవు.

జంక్ ఫుడ్ :
కొంతమంది బరువు తగ్గాలని అనుకున్నా కూడా కుకీలు,పేస్ట్రీలు, డెజర్ట్‌ల వంటి బేక్ చేసిన ఆహారాలను తింటూ ఉంటారు. వాటిలో చక్కెర, ఫ్రక్టోజ్, అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఇవి బరువు తగ్గించే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ఇదే కాకుండా, అనేక రకాల జంక్ ఫుడ్‌లో ఆహారాలలో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య పెరుగుతుంది.


నూనె ఎక్కువగా ఆహారాలు:
ఫ్రెంచ్ ఫ్రైస్ , బంగాళాదుంప చిప్స్ వంటి వేయించిన ఆహారాలు సాధారణంగా కేలరీలు, కొవ్వులో ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అంతే కాకుండా ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. అదనంగా కాల్చిన లేదా వేయించిన బంగాళాదుంపలలో క్యాన్సర్‌తో ముడిపడి ఉన్న అక్రిలమైడ్స్ అనే పదార్థాలు ఉంటాయి. అందుకే వీటిని తినడం తగ్గించాలి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోకండి. వాటిలో ఫైబర్ లేదా ప్రోటీన్ ఉండవు. అందుకే ఇది త్వరగా ఆకలిగా అనిపిస్తుంది. వీటిని అతిగా తినడం వల్ల బరువు తగ్గడం మరింత కష్టం అవుతుంది.

పాస్తా , బ్రెడ్:
కొంతమంది టిఫిన్‌లో తెల్ల పాస్తా, తెల్ల బ్రెడ్ ఎక్కువగా తింటారు. కానీ మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం వాటి వినియోగాన్ని పరిమితం చేయండి. వీటిని శుద్ధి చేసిన గోధుమ పిండితో తయారు చేస్తారు. దీనివల్ల వాటిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి . కానీ ఫైబర్, ప్రోటీన్, అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. బదులుగా, తృణధాన్యాలతో తయారు చేసిన పాస్తా , బ్రెడ్‌ను ఎంచుకోండి. ఎందుకంటే వాటిలో ఫైబర్ , పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడతాయి.

Also Read: మురికిగా మారిన ఈ వస్తువులను పేస్ట్‌తో శుభ్రం చేస్తే.. మెరిసిపోతాయ్

టోఫీలు, చాక్లెట్లు:
మీరు బరువు తగ్గాలనుకుంటే ముందుగా టోఫీలు, చాక్లెట్లు తినడం మానేయండి. ఎందుకంటే వాటిలో అధిక మొత్తంలో చక్కెర , కేలరీలు ఉంటాయి. ఒక సాధారణ సైజు చాక్లెట్ బార్‌లో దాదాపు 200-300 కేలరీలు ఉంటాయి. పెద్ద చాక్లెట్ బార్‌లలో ఇంకా ఎక్కువ కేలరీలు ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. దీంతో పాటు అధిక చక్కెర తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుదల, రక్తపోటు వంటి సమస్యలు కూడా వస్తాయి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×