Sundeep Kishan: ఈరోజుల్లో టాలీవుడ్‌లో చాలామంది యంగ్ హీరోలు ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. సందీప్ నటించిన సినిమాలు చూసిన ప్రేక్షకులంతా అవి బాగున్నాయనే ప్రశంసిస్తున్నారు. కానీ ఎందుకో తనకు ఇంకా అనుకున్నంత గుర్తింపు రావడం లేదు, అందుకే టైర్ 2 కేటగిరిలో ఇంకా సందీప్ చేరలేకపోతున్నాడు. అందుకే తను ప్రతీ సినిమాకు ప్రమోట్ చేసుకున్నప్పుడు తన గత సినిమాల గురించి, తనకు ఉన్న మార్కెట్ గురించి ప్రస్తావన వస్తుంది. తాజాగా ‘మజాకా’ ప్రమోషన్స్‌లో కూడా అదే జరిగింది. అందుకే తన గురించి, తన సినిమాల గురించి తక్కువ చేసి మాట్లాడిన వారికి అదిరిపోయే రిప్లై ఇచ్చాడు సందీప్ కిషన్.
బ్లాక్‌బస్టర్ దర్శకుడితో సినిమా
‘‘నా గత రెండు సినిమాలు హిట్టే కదా. అందులో నుండి మూడు సూపర్ హిట్ పాటలు వచ్చాయి. 100 కోట్ల డైరెక్టర్‌తో చేస్తున్నాను. ఆయన ఇప్పటివరకు 4 సినిమాలు చేశారు. అందులో రూ.100 కోట్ల బ్లాక్‌బస్టర్ ఉంది. ఆయన అయిదో సినిమా నాతో చేస్తున్నారు. ఆయన అన్ని సినిమాలకు మంచి బిజినెస్‌లు అయ్యాయి. నా తర్వాత సినిమా ఏంటో అందరికీ తెలుసు. దాని తర్వాత సౌత్ ఇండియా మొదటి నెట్‌ఫ్లిక్స్ షో చేస్తున్నాను, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో లీడ్‌గా చేస్తున్నాను. నాకు తెలిసి నా ఏజ్ గ్రూప్‌లో ఇలాంటి బెస్ట్ లైనప్ ఏ యాక్టర్‌కు లేదు. వెరైటీ ఉంది, వేర్వేరు జోనర్స్ ఉన్నాయి. అన్నింటికి మంచి బడ్జెట్ ఉంది’’ అని వివరించాడు సందీప్ కిషన్.
నేను సాధించింది అదే
‘‘థియేట్రికల్ బిజినెస్ పరంగా చాలామంది మాట్లాడుతున్నారు. అది మజాకా సినిమాతో సాధిస్తానని నమ్ముతున్నాను. తర్వాత సినిమాతో కూడా టార్గెట్ కొడతాను. దానికోసం కూడా నేను కష్టపడుతున్నాను, ప్రయత్నిస్తున్నాను. ఒక నటుడిగా ఈ 15 ఏళ్లలో ప్రేక్షకుల్లో నాకు ఒక ఐడెంటిటీ వచ్చింది. మేకర్స్‌తో నేను చేసే సినిమాలకు కూడా గుర్తింపు వచ్చింది. కానీ కలెక్షన్స్ అనేవి చాలా ముఖ్యమని చాలామంది అంటున్నారు. అందులో నిజంగానే నేను వెనకబడి ఉన్నాను. ఈ సినిమాతో, తరువాతి సినిమాతో కచ్చితంగా ఆ టార్గెట్ రీచ్ అవుతాను’’ అంటూ నమ్మకంగా చెప్పుకొచ్చాడు సందీప్ కిషన్. అంతే కాకుండా ‘మజాకా’ కలెక్షన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read: ఛాన్స్ వస్తే అలాంటి సీన్స్ కూడా చేస్తా.. తెలుగమ్మాయి షాకింగ్ స్టేట్‌మెంట్
కావాలంటే రాసిపెట్టుకోండి
‘‘ఇప్పటివరకు నా కెరీర్‌లో నేనెప్పుడూ చూడని కలెక్షన్స్ మజాకాకు వస్తాయని నమ్ముతున్నాను. అది ఎంత అని నాకు తెలీదు కానీ ఇది కచ్చితంగా జరుగుతుంది. ఊరు పేరు భైరవకోన సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను వీకెండ్ వరకు మజాకా దాటేస్తుంది. కావాలంటే మీరు ఇది నోట్ చేసుకోండి’’ అని గట్టిగా చెప్పాడు సందీప్ కిషన్. హీరోగా పరిచయమయినప్పటి నుండి తన స్క్రిప్ట్ సెలక్షన్‌తో చాలామంది ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు సందీప్ కిషన్ (Sundeep Kishan). కానీ చాలామంది ఇతర హీరోలకు ఉన్నట్టుగా తనకు కలెక్షన్స్ విషయంలో రికార్డులు లేవని ప్రేక్షకులు కూడా అనుకుంటూ ఉంటారు. ‘మజాకా’ (Mazaka)తో అంతా మారబోతుందని సందీప్ బలంగా నమ్ముతున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 26న విడుదల కానుంది.