Odela 2 ..సంపత్ నంది(Sampath Nandi).. ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకి రచయితగా పనిచేసి మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 2022లో క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘ఓదెల 2’ రాబోతోంది. అశోక్ తేజ (Ashok Tej) దర్శకత్వంలో సంపత్ నంది రూపొందించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో తమన్నా భాటియా(Tamannaah bhatia), హెబ్బా పటేల్(Hebba patel), వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్రల్లో రూపొందుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద నాగ సాధువుల సమక్షంలో ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు.
ఓదెల 2 టీజర్ రిలీజ్..
ఇదిలా ఉండగా ఈ సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్న తమన్నా.. మాంసాహారాన్ని మానేసిందట .40 డిగ్రీల ఎండలో కూడా కాళ్లకు చెప్పులు లేకుండా నటించిందని సంపత్ నంది తెలిపారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలాంటి సమయంలో సంపత్ నంది ఈ సినిమాపై హోప్స్ ఎక్కువగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా రెండు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ పై ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈయన రూపొందించిన ‘సింబా’ సినిమాపై కూడా అంచనాలు పెంచేసి, ఈ సినిమా రైట్స్ కి భారీగా డిమాండ్ చేశాడు. ఇక సినిమా బాగుందని నమ్మి , ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్.. చాలామంది లాస్ అయ్యారు. కారణం ఈ సినిమా ఫ్లాప్ అవడం.
ALSO READ:Drishyam 3: త్వరలో పట్టాలెక్కనున్న దృశ్యం 3..
రిస్క్ చేస్తున్న సంపత్ నంది..
అయితే ఇప్పుడు ఓదెలా 2 కి కూడా అదే రేంజిలో డిమాండ్ చేస్తుండడంతో మళ్లీ ఈయనపై నమ్మకం పెట్టుకొని ఈ సినిమా హక్కులను ఎక్కువ రేటు కొనుగోలు చేస్తే, ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయి.. సినిమా హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే.. ఎవరు బాధ్యులు? అనే కోణంలో డిస్ట్రిబ్యూటర్లు కాస్త వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. అసలే సింబా సినిమా డిజాస్టర్ అవడంతో దాదాపుగా సంపత్ నందిపై నమ్మకాలు కోల్పోయారు డిస్ట్రిబ్యూటర్స్. ఇలాంటి సమయంలో మళ్ళీ ఓదెలా 2 కి డిమాండ్ చేస్తే అసలు ఎవరైనా డిస్ట్రిబ్యూటర్లు సినిమా హక్కులు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారా? ఈ పరిస్థితి సంపత్ నందికి అర్థం అవుతుందా ? అనే రేంజ్ లో నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అసలే ఉన్న సినిమాలను కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి సమయంలో మళ్లీ సంపత్ నంది ఓదెల 2 కోసం ఎక్కువ డిమాండ్ చేస్తూ రిస్క్ చేస్తున్నాడేమో..? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఇకనైనా సంపత్ నంది ఓదెల 2 హక్కుల విషయంలో కాస్త వెనక్కి తగ్గితే బాగుంటుందని.. లేకపోతే డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వస్తే, తనదే బాధ్యత అన్నట్టు మాట ఇస్తే ఈ సినిమాను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి దీనిపై సంపత్ నంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.